ప్యారిస్ ప్యారిస్ చిత్రంలో కాజల్‌అగర్వాల్
సినిమా: పాపం నటి కాజల్ అగర్వాల్‌కు మాత్రమే ఎందుకిలా జరుగుతోంది. 2017లో విజయ్‌తో నటించిన మెర్శల్ చిత్రం తరువాత కోలీవుడ్‌లో ఈ అమ్మడు నటించిన చిత్రమేదీ తెరపైకి రాలేదు. అలాగని తెలుగులో ఇటీవల నటించిన చిత్రమేదీ విజయం సాధించలేదు. అలాగని కాజల్‌అగర్వాల్‌కు అవకాశాలు లేకుండా పోలేదు. ముఖ్యంగా ప్రస్తుతం కోలీవుడ్‌నే ఈ బ్యూటీ నమ్ముకుంది. అందులో ఒకటి జయంరవితో డూయెట్స్ పాడిన కోమాలి చిత్రం. ఇది నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 15న తెరపైకి రానుంది. ఇక మరో లక్కీచాన్స్ విశ్వనటుడు కమలహాసన్ సరసన శంకర్ తెకెక్కించనున్న ఇండియన్–2 చిత్రం. ఇంకేంటి కాజల్ çఫుల్‌జోష్‌లోనే ఉందిగా? అని అంటారా? ఈ అమ్మడు నటించిన తొలి హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం ప్యారిస్ ప్యారిస్. ఇది హిందీలో సంచలన విజయాన్ని సాధించిన క్వీన్ చిత్రానికి రీమేక్. ఎందరో ప్రముఖ నటీమణులు నటించాలని ఆశ పడ్డ ఈ చిత్రంలోని కథానాయకి పాత్రను పోషించే అవకాశం నటి కాజల్‌అగర్వాల్‌కు దక్కింది.
ఇక్కడి వరకూ బాగానే ఉంది. ఇదే చిత్రం తెలుగులో నటి తమన్నా హీరోయిన్‌గా దటీజ్ మహాలక్ష్మి పేరుతో తెరకెక్కింది. ఇక కన్నడంలో పరూల్‌మాధవ్ హీరోయిన్‌గా బటర్‌ఫ్లై పేరుతోనూ, మలయాళంలో మంజిమామోహన్ హీరోయిన్‌గా జామ్‌జామ్ పేరుతోనూ రూపొందింది. మీడియంట్ ఫిలిం పతాకంపై మనుకుమార్ నాలుగు భాషల్లోనూ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. వచ్చిన చిక్కేంటంటే తెలుగు, కన్నడం, మలయాళం వెర్షన్లకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్లను ఇచ్చారు. కాజల్‌అగర్వాల్ నటించిన తమిళ వెర్షన్‌కే 25 వరకూ ఆడియో, వీడియో కట్స్‌ను ఇచ్చారు. ఒకే కథకు రీమేక్ అయిన ఈ నాలుగు చిత్రాల్లో మూడు చిత్రాలకు సెన్సార్ గ్రీన్ సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే కాజల్‌అగర్వాల్ నటించిన తమిళ వెర్షన్ ప్యారిస్ ప్యారిస్ చిత్రానికి అన్ని కట్స్ ఇవ్వడంతో పాపం కాజల్ ఏం చేసిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇదే అభిప్రాయానికి వచ్చిన ప్యారిస్ ప్యారిస్ చిత్ర నిర్మాత రివైజింగ్ కమిటీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు మీడియాకు ఆదివారం సాయంత్రం వ్యక్తం చేశారు. మరి ఆ కమిటీ కాజల్ చిత్రం ప్యారిస్ ప్యారిస్ చిత్రాన్ని చిన్న చిన్న మార్పులను చూపించి వదిలేస్తుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment