ఫ్రెండ్సంతా బీచ్ సైడ్ పార్టీకు వెళ్లారు. అక్కడ మూడ్‌కి తగ్గట్టు షాంపైన్ పొంగించారు. బీట్స్‌కి తగ్గట్టు పాటను అందుకోవాలి. వెంటనే కాజల్ ‘పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్..’ అంటూ సాంగ్ అందుకున్నారు. దానికి తగ్గట్టు హుషారుగా నాలుగు స్టెప్పులు కూడా వేశారు. కాజల్ హుషారుని కామ్‌గా దూరం నుంచి చూస్తూ పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు శర్వానంద్. ఇదంతా ‘రణరంగం’ సినిమాలో మూడో సాంగ్ ‘పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్..’ సందర్భం. కృష్ణ చైతన్య రచించిన ఈ పాటకు సన్నీ ఎం.ఆర్ స్వరాలు అందించారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్, కాజల్, కల్యాణీ ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రణరంగం’. ఆగస్ట్ 15న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అన్నట్లు.. ఈ పాటలోని కాజల్ స్టిల్ చూస్తే ‘పిక్చర్ పర్ఫెక్ట్’ అనుకుండా ఉండలేం కదూ.
Comments
Please login to add a commentAdd a comment