నేను తెలుగు సినిమాకు దూరమయ్యేది అప్పుడే | Kajal Aggarwal's silly answers | Sakshi
Sakshi News home page

నేను తెలుగు సినిమాకు దూరమయ్యేది అప్పుడే

Dec 23 2013 12:19 AM | Updated on Sep 2 2017 1:51 AM

నేను తెలుగు సినిమాకు దూరమయ్యేది అప్పుడే

నేను తెలుగు సినిమాకు దూరమయ్యేది అప్పుడే

‘‘ప్రపంచ దేశాలన్నీ చూశాను... కానీ ఇంత అందాన్ని మాత్రం ఎక్కడా చూడలేదు’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు కాజల్ అగర్వాల్.

 ‘‘ప్రపంచ దేశాలన్నీ చూశాను... కానీ ఇంత అందాన్ని మాత్రం ఎక్కడా చూడలేదు’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు కాజల్ అగర్వాల్. ప్రస్తుతం హిందీ, తమిళ చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ... తెలుగు సినిమాకు కాస్త దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఓ వస్త్రదుకాణ ప్రారంభోత్సవానికి తూర్పుగోదావరి జిల్లా వెళ్లారు. కోనసీమ ప్రకృతి అందాలు చూసి పరశించిన ఈ అందాలభామ మాట్లాడుతూ ‘‘భారతీయ సౌందర్యం అంటే కోనసీమే. ఇక్కడి వాతావరణం ఎంతో అద్భుతంగా ఉంటుందని విన్నాను. 
 
 కానీ చూడటం ఇదే. కాసేపట్లో ఈ వాతావరణానికి, మీ అభిమానానికీ దూరంగా వెళ్లిపోతున్నానంటే... నిజంగా బాధేస్తోంది’’ అన్నారు. ‘తెలుగు సినిమాకు దూరంగా ఉండటానికి కారణమేంటి?’ అని విలేకరులు అడగ్గా- ‘‘నేను తెలుగు సినిమాకు దూరంగా ఉంటున్నాననడం కరెక్ట్ కాదు. రెండు భారీ తెలుగు చిత్రాల్లో నటించబోతున్నాను. ఆ సినిమాలకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే తెలుగుతెరపై కనిపిస్తా. తెలుగు సినిమాకు నేను దూరం అవ్వడం అనేది జరిగితే... అది నా కెరీర్ ఎండ్ అయ్యాకే’’అని చెప్పుకొచ్చారు కాజల్. తూర్పుగోదావరి జిల్లాలో వస్త్ర దుకాణాన్ని ప్రారంభించినందుకు కాజల్ తీసుకున్న పారితోషికం అక్షరాలా పాతిక లక్షల రూపాయలని సమాచారం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement