showroom open
-
సింకో గోల్డ్, డైమండ్ షోరుమ్ ను ప్రారంభించిన సంయుక్త మీనన్
-
కళ్యాణ్ జ్యుయలర్స్ 3వ షోరూమ్
ఆభరణాల రిటైల్ చెయిన్ కళ్యాణ్ జ్యూయలర్స్ హైదరాబాద్‌లో తన మూడవ షోరూమ్‌ను ప్రారంభించనుంది. ఈ నెల 21న (బుధవారం) ఏ.ఎస్ రావునగర్‌లో సంస్థ బ్రాండ్ అంబాసిడర్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ఉదయం 11 గంటలకు షోరూమ్ ప్రారంభోత్సవం జరగనుందని వెల్లడించింది. అంతర్జాతీయంగా ఇది 138 షోరూమ్ కానుండగా, తెలంగాణలో నాలుగవ షోరూమ్ అని కంపెనీ చైర్మన్, ఎండీ టీ ఎస్ కళ్యాణరామన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రారంభోత్సవంలో భాగంగా మేకింగ్ చార్జీలపై 3 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. కోటి రూపాయిల వరకు ఇన్స్టెంట్ రిడీమ్ వోచర్లను ఇస్తున్నాం. ఇంతేకాకుండా, వీక్లీ బంపర్ బహుమతిలో లక్ష రూపాయిల ఆభరణాలను అందిస్తున్నాం’ అని వెల్లడించారు. -
పాయ్ ఇంటర్నేషనల్ 100వ స్టోర్ ప్రారంభం
-
నేను తెలుగు సినిమాకు దూరమయ్యేది అప్పుడే
‘‘ప్రపంచ దేశాలన్నీ చూశాను... కానీ ఇంత అందాన్ని మాత్రం ఎక్కడా చూడలేదు’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు కాజల్ అగర్వాల్. ప్రస్తుతం హిందీ, తమిళ చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ... తెలుగు సినిమాకు కాస్త దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఓ వస్త్రదుకాణ ప్రారంభోత్సవానికి తూర్పుగోదావరి జిల్లా వెళ్లారు. కోనసీమ ప్రకృతి అందాలు చూసి పరశించిన ఈ అందాలభామ మాట్లాడుతూ ‘‘భారతీయ సౌందర్యం అంటే కోనసీమే. ఇక్కడి వాతావరణం ఎంతో అద్భుతంగా ఉంటుందని విన్నాను. కానీ చూడటం ఇదే. కాసేపట్లో ఈ వాతావరణానికి, మీ అభిమానానికీ దూరంగా వెళ్లిపోతున్నానంటే... నిజంగా బాధేస్తోంది’’ అన్నారు. ‘తెలుగు సినిమాకు దూరంగా ఉండటానికి కారణమేంటి?’ అని విలేకరులు అడగ్గా- ‘‘నేను తెలుగు సినిమాకు దూరంగా ఉంటున్నాననడం కరెక్ట్ కాదు. రెండు భారీ తెలుగు చిత్రాల్లో నటించబోతున్నాను. ఆ సినిమాలకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే తెలుగుతెరపై కనిపిస్తా. తెలుగు సినిమాకు నేను దూరం అవ్వడం అనేది జరిగితే... అది నా కెరీర్ ఎండ్ అయ్యాకే’’అని చెప్పుకొచ్చారు కాజల్. తూర్పుగోదావరి జిల్లాలో వస్త్ర దుకాణాన్ని ప్రారంభించినందుకు కాజల్ తీసుకున్న పారితోషికం అక్షరాలా పాతిక లక్షల రూపాయలని సమాచారం.