విశాల్‌తో కాజల్ | kajal with vishal | Sakshi
Sakshi News home page

విశాల్‌తో కాజల్

Published Thu, Mar 5 2015 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 10:18 PM

విశాల్‌తో కాజల్

విశాల్‌తో కాజల్

నటుడు విశాల్ తాజా చిత్రం బుధవారం ఉదయం చెన్నైలో ప్రారంభమైంది. పాండియనాడు, నాన్ శిగప్పు మనిదన్, పూజై చిత్రాలతో వరుసగా హ్యాట్రిక్ సాధించిన విశాల్ తాజా చిత్రానికి సిద్ధమయ్యారు. పాండియనాడు చిత్రంతో విశాల్‌కు మంచి సక్సెస్‌ను అందించిన దర్శకుడు సుశీంద్రన్. తాజా చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ చిత్రారన్ని వేందర్ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. కాజల్ అగర్వాల్ తొలిసారిగా విశాల్‌తో డ్యూయెట్లు పాడనున్నారు. ఈ చిత్రం స్థానిక చెట్‌పెట్‌లో గల సెందూర్‌పూవే హౌస్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఆర్ కె ఆనంద్‌రాజ్ బాలీవుడ్ నటుడు మురళీశర్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం గురించి విశాల్ మాట్లాడుతూ ఈ చిత్రం తనతో పాటు చిత్ర యూనిట్ అందరికీ స్పెషల్ అన్నారు.

పాండియనాడు వంటి విజయవంతమైన చిత్రం తరువాత అదే టీమ్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉంటాయన్నారు. వాటిని రీచ్ అవ్వాలనే కసితో పని చేయనున్నట్లు తెలిపారు. ఎప్పుడు నవ్వుతూనే తనకు కావలసిన అవుట్‌పుట్‌ను నటీనటుల నుంచి రాబట్టుకునే సుశీంద్రన్ దర్శకత్వంలో చేయడం చాలా ఇష్టంగా విశాల్ పేర్కొన్నారు. డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం కోసం ఆయన ఇప్పటికే రెండు పాటలను రికార్డ్ చేసినట్లు దర్శకుడు తెలిపారు. వేల్‌రాజ్ ఛాయాగ్రహణం నెరపుతున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు విశాల్ తల్లిదండ్రులతో పాటు టి.శివ, ఆర్.కె., ఆనంద్‌రాజ్, కలైపులి ఎస్ థాను, ధనుంజయన్ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement