అప్పట్లో ఇంతే.. | Kajol shares a throwback pic of the days when phones were big and shoes were comfy | Sakshi
Sakshi News home page

అప్పట్లో ఇంతే..

Published Wed, Feb 21 2018 12:48 PM | Last Updated on Sat, Aug 25 2018 6:31 PM

Kajol shares a throwback pic of the days when phones were big and shoes were comfy - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్‌ నటి కాజోల్‌ సోషల్‌ మీడియాలో తరచూ పోస్ట్‌లు, ఫోటోలతో అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటారు. తాజాగా ఆమె 1990ల నాటి ఫోటోను పోస్ట్‌ చేసి అభిమానులకు పాత జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చారు. ఫోటోతో పాటు అప్పటి ఫోన్లు ఇంత పెద్దగా ఉండేవని..షూస్‌ చాలా సౌకర్యవంతంగా ఉంటాయని, వాటిని ఇప్పుడు తాను మిస్‌ అవుతున్నానని రాసుకొచ్చారు.

ఈ ఫోటోలో కాజోల్‌ లెమన్‌ కలర్‌ డ్రెస్‌ ధరించి, భారీ సైజ్‌లో ఉన్న మొబైల్‌ ఫోన్‌తో కనిపించారు. ఈ ఫోటోను చూసిన అభిమానులంతా 1990ల్లో అలరించిన బాజీగర్‌ రోజుల్లోకి వెళ్లామని చెబుతున్నారు. ఇక కాజోల్‌ త్వరలో ప్రదీప్‌ సర్కార్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీలో నటిస్తారు. ఆనంద్‌ గాంధీ గుజరాతీ నాటకం బేటా కగ్డో ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement