‘‘శ్రీదేవి స్టార్‌డమ్‌ని, తన మ్యాజిక్‌ని సిల్వర్ స్క్రీన్ మీద చూస్తూనే పెరిగాను. శ్రీదేవి ఒక యాక్టింగ్ స్కూల్. ఎప్పటికీ నా ఫేవరెట్ ఐకాన్’’ అని శ్రీదేవి మీద తనకున్న అభిమానాన్ని చెప్పుకొచ్చారు కాజోల్. చెప్పడమే కాదు శ్రీదేవి మీద రాబోతున్న ‘శ్రీదేవి : ద ఎటర్నల్ స్క్రీన్ గాడెస్’ పుస్తకానికి కాజోల్ ముందు మాట కూడా రాశారు. శ్రీదేవి జీవితాన్ని ఓ పుస్తకంగా మలిచారు రచయిత సత్యర్థ్. పెంగ్విన్ బుక్స్ సంస్థ ఈ పుస్తకాన్ని మార్కెట్లోకి తీసుకు రానుంది.
శ్రీదేవి సౌత్‌లో హీరోయిన్‌గా స్టార్ట్ అయి బాలీవుడ్‌లో నెం. 1గా ఎలా ఎదిగారు? ఆమె ప్రయాణం, కుటుంబం ఇలా అన్ని విషయాలను ఆ పుస్తకంలో పొందుపరిచారు. ‘‘స్టార్ నుంచి సూపర్‌స్టార్‌గా ఎదిగిన శ్రీదేవి ప్రయాణాన్ని ఇండస్ట్రీ కిడ్‌గా కాజోల్ గమనించారు. అదంతా ముందు మాటలో అద్భుతంగా రాసుకొచ్చారు. తనకి స్ఫూర్తిని ఇచ్చిన నటికి ప్రేమతో రాసిన లేఖలా ఈ ముందు మాట ఉంది’’ అని పుస్తక రచయిత సత్యర్థ్ తెలిపారు. ‘‘ఈ అవకాశాన్ని కల్పించిన అందరికీ థ్యాంక్స్. ఈ అవకాశం రావడం గౌరవంగా ఉంది. ముందు మాట రాయడం ద్వారా తొలి లేడీ సూపర్‌స్టార్‌కు నా వంతు నివాళి అందించానని అనుకుంటున్నాను’’ అన్నారు కాజోల్.
Comments
Please login to add a commentAdd a comment