నవరస నట జ్ఞాని @ 59 | Kamal haasan turns 59 | Sakshi
Sakshi News home page

నవరస నట జ్ఞాని @ 59

Published Thu, Nov 7 2013 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM

నవరస నట జ్ఞాని @ 59

నవరస నట జ్ఞాని @ 59

 నటనలో నవరసా లు ఉంటాయంటారు. కమల్‌హాసన్ దాన్ని అధిగమించి దశావతారం చిత్రంలో దశ రసాలు పలికిం చారు. భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన కళాకారుల్లో ప్రప్రథముడు ఆయన. ఐదేళ్ల వయసు నుంచే కళామతల్లి ఒడిలో పెరిగి నటనను అవపోషణ చేసుకున్న కమల్‌హాసన్ 55 ఏళ్లుగా ఆ తల్లికి ఎనలేని సేవ చేస్తున్నారు. నాయకుడిగా, అమాయకుడిగా, అమ ర ప్రేమికుడిగా, అమెరికా అధ్యక్షుడిగా, మరుగుజ్జు వాడిగా ఏ పాత్ర చేసినా వాటిలో ఇమిడిపోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆధునిక సాంకేతిక పరి జ్ఞానంతో సినిమాను ఉన్నత స్థాయి లో నిలబెట్టడానికి ఈ కళా పిపాసి ఎప్పు డూ ముందుంటారు.
 
  విశ్వరూపం చిత్రం లో తన నటన, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెరపై ఆవిష్కరించి ప్రపంచ సినిమానే తిరిగి చూసేలా చేసిన కమల్‌హాసన్ తాజా గా విశ్వరూపం-2తో ఎలాంటి విశేషాలకు కేంద్ర బిందువుకానున్నారోనన్న ఆసక్తితో సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమానే ప్రపంచంగా జీవిస్తున్న కమల్ జన్మదినం నవంబర్ 7. గురువారం 59వ ఏట అడుగుపెడుతున్న ఆరు దశాబ్దాల కమల్ ఆయన అభిమానులకిప్పటికీ 20 ఏళ్ల హీరోనే. అలాంటి నవరసన నటనా జ్ఞానికి జన్మదిన శుభాకాంక్షలు చెబుదాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement