దేశానికీ..ప్రజలకూ ప్రేమతో...
కమల్‌హాసన్ ‘విశ్వరూపం’ విడుదలై నాలుగేళ్లయింది. ఆ సినిమా తీస్తున్నప్పుడే సీక్వెల్‌లో 40 శాతం చిత్రీకరణ పూర్తి చేశానని కమల్ అప్పట్లో పేర్కొన్నారు. కానీ, సీక్వెల్ ఇప్పటివరకూ తెర పైకి రాలేదు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవుతున్నట్లు ఓ సందర్భంలో పేర్కొన్నారు.
ఇప్పుడీ చిత్రానికి సంబంధించిన పనులు పూర్తి కావచ్చాయి. మంగళవారం ‘విశ్వరూపం–2’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ‘దేశానికీ... దేశ ప్రజలకూ ప్రేమతో’ అంటూ కమల్ ఈ పోస్టర్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. సినిమా విడుదల తేదీని కూడా త్వరలో ప్రకటిస్తారట. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో నటించడంతో పాటు కమల్ దర్శకత్వం వహించారు.
Happy to anounce:
— Kamal Haasan (@ikamalhaasan) 2 May 2017
Today 7pm Vishwaroop 2 Hindi first look poster & Vishwaroopam Tamizh Telugu 1st look posters release Exclusively for you