కమల్‌ పుట్టిన రోజున ట్రైలర్‌ విడుదల | Kamal Haasan Vishwaroopam 2 trailer release on his birthday | Sakshi

కమల్‌ పుట్టిన రోజున ట్రైలర్‌ విడుదల

Nov 4 2017 1:30 PM | Updated on Nov 4 2017 1:30 PM

Kamal Haasan Vishwaroopam 2 trailer release on his birthday - Sakshi

ఇటీవల కమల్‌ హాసన్‌ పేరు ప్రముఖంగా వార్తల్లో వినిపిస్తున్నా.. సినిమాల విషయంలో మాత్రం కాదు. తమిళ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న కమల్‌, చాలా కాలం తరువాత ఓ సినిమాకు సంబందించిన వార్తతో తెర మీదకు వచ్చారు. చాలా కాలంగా రిలీజ్‌ కోసం ఎదురుచూస్తున్న కమల్‌ కొత్త చిత్రం విశ్వరూపం 2 సినిమా ట్రైలర్‌ ను లోకనాయకుడిగా పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారట.

కమల్‌ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆర్ధిక సమస్యల కారణంగా చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. సినిమాను నిర్మించిన ఆస్కార్‌ రవిచంద్రన్‌ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవటంతో కమల్‌ స్వయంగా పూనుకొని విశ్వరూపం 2 రిలీజ్‌ కు ప్రయత్నిస్తున్నాడు. కమల్‌ పుట్టిన రోజు సందర్భంగా నవంబర్‌ 7న విశ్వరూపం 2 ట్రైలర్‌ ను రిలీజ్‌ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే కమల్‌ నుంచి మాత్రం ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement