
సోషల్ మీడియాలో ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతడు తన ఇన్‌స్టాలో షేర్ చేసే ప్రతీ పోస్ట్ క్షణాల్లోనే తెగ వైరల్ అవుతుంది. ఇక లాక్‌డౌన్ సమయంలో ‘లాక్‌డౌన్‌విత్‌దజోహార్స్’ పేరిట పలు ఫన్నీ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌ను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా తన పిల్లలు యశ్, రూహిలతో కలిసి సరదాగా చేసిన ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
తన కొడుకు యశ్‌ను కరణ్ జోహార్ పలు ప్రశ్నలు సంధిస్తాడు. ఈ క్రమంలో కొన్నింటికి సరిగ్గానే సమాధానమిచ్చిన యశ్.. ‘నీ దేశం పేరేంటి?’ అని అడగ్గా కరణ్‌కు ఊహించిన సమాధానం ఎదురైంది. ‘నా దేశం పేరు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్’ అని బదులిచ్చాడు. అయితే అది తప్పని వివరిస్తూ మన దేశం ఇండియా అని, ఐ లవ్ ఇండియా అని యశ్ నోట కరణ్ పలికించాడు. ఇక రూహీ కూడా తన తండ్రి అడిగినవాటికి ముద్దుముద్దుగా సమాధానం ఇచ్చింది. ఇక గతంలో కూడా తన పిల్లలతో రూపొందించిన పలు ఫన్నీ వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
చదవండి:
‘ఇస్తా.. మొత్తం తిరిగి ఇచ్చేస్తా’
ఆర్‌ఆర్‌ఆర్ అభిమానులకు చేదు వార్త
Comments
Please login to add a commentAdd a comment