బికినీ ఫొటోల్లో కన్పిస్తే తప్పేంటి? | Katrina Kaif finally speaks about leaked bikini photos | Sakshi
Sakshi News home page

బికినీ ఫొటోల్లో కన్పిస్తే తప్పేంటి?

Published Wed, Nov 20 2013 10:08 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

బికినీ ఫొటోల్లో కన్పిస్తే తప్పేంటి? - Sakshi

బికినీ ఫొటోల్లో కన్పిస్తే తప్పేంటి?

బాలీవుడ్ హాట్ బ్యూటీ  కత్రినా కైఫ్‌ ఫోటోలు ప్రస్తుతం నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఫారిన్‌లో బీచ్‌లో విచ్చలవిడిగా అందాల అరబోసింది. అయితే ఆ ఫోటోలపై ఈ భామ ఏమంటుందో తెలుసా?? జస్ట్‌ లుక్‌ ఇట్‌....కత్తిలాంటి కత్రినా ఫోటోలు కెవ్వుమనిపిస్తున్నాయి. నెట్‌లో గత కొంతకాలంగా ఈ ఇమేజ్‌లు హల్‌చల్‌ చేస్తున్నాయి. గతంలో టు పీస్‌ బికినీతో కనువిందు చేసిన ఈ భామ ఫోటోలు కుర్రాళ్ళను కైపెక్కిస్తున్నాయి. అయితే ఈ ఫోటోలపై కొన్ని అనుమానులు ఉన్నాయి. మార్ఫింగ్‌ చేసిన ఫోటోలని అనుమానం.

అయితే ఆ  ఫోటోలపై తొలిసారి కత్రినా స్పందించింది

బికినీ ఫొటోల్లో కన్పిస్తే తప్పేంటని ప్రశ్నిస్తోంది  కత్రినా కైఫ్‌. బాలీవుడ్‌లో చాలామంది బికినీల్లో కన్పించారు.. నేనూ అంతే. అయినా సిమ్మింగ్‌ పూల్‌లో బికినీతో కాకుండా.. జీన్స్‌తో దిగితే ఎలా.? అని ప్రశ్నించిన ఆమె‌, ఇటీవలే కత్రినా బికినీ ఫొటోలంటూ.. ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోన్న కొన్ని ఫోటోలపైనా స్పందించింది. అవి తన ఫోటోలేనని డిసైడ్‌ చేసింది. ఫారిన్‌ బీచ్‌లలో తిరుగుతున్నప్పుడు ఎవరో తెలియని వారు తీసిన ఫోటోలని ఆమె చెప్పుకొచ్చింది.


ఎంత స్టార్‌లైనా తమకు పర్సనల్‌ లైఫ్‌ ఉంటుంది కదా...సరదాగా స్విమ్‌ చేయాలని ఉంటే ఇలా చేయడం ఏ మాత్రం సమంజసం కాదని వివరణ ఇచ్చింది. 'అవి నా ఫొటోలే.. అయితే అవి దొంగతనంగా ఎవరో చిత్రీకరించినవి.. వాటి గురించి సీరియస్‌గా స్పందించాల్సిన అవసరం లేదు.. విదేశాల్లోని బీచ్‌లలో తిరుగుతున్నప్పుడు.. తెలియనివారెవరో తీసిన ఫొటోల గురించి నన్ను వివరణ అడగటం బాగాలేదు..' అంటూ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది కత్రినాకైఫ్‌.అయితే ఆ టూర్‌ తన ఫ్యామిలీతో వెళ్ళిందని...బాయ్‌ఫ్రెండ్‌ ఎవరూ లేరని చెప్పుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement