నటుడు దిలీప్ (ఫైల్ ఫొటో)
కొచ్చి: సినీ నటిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మలయాళ నటుడు దిలీప్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను శనివారం కొచ్చి అదనపు స్పెషల్ సెషన్ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో నిందితుడైన దిలీప్ పిటిషన్‌ను తిరస్కరించాలని విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ కోర్టును కోరిన తరువాత కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కేసు విచారణను దిలీప్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ట్రయల్ కోర్టు నిర్ణయంతో దిలీప్ హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, 2017 ఫిబ్రవరి 17న ప్రముఖ నటిని కారులో నుంచి అపహరించి అనంతరం దాడికి దిగిన కేసులో మలయాళ స్టార్ దిలీప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో దిలీప్‌ను 2017 జూలైలో కేరళ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం దిలీప్‌ను నిందితుడుగా పేర్కొంటూ ఛార్జీషీట్ దాఖలు చేశారు. కొన్ని వారాలు జైలులో ఉన్న దిలీప్ తరువాత బెయిల్‌పై బయటికి వచ్చాడు. బెయిల్‌పై వచ్చిన తరువాత కేసు విచారణను ప్రభావితం చేయడానికి దిలీప్ ప్రయత్నించినట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు నవంబర్‌లో ట్రయల్ కోర్టును ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment