మరో వివాదంలో నటి.. లీగల్‌ నోటీసులు | Ketan Mehta sends legal notice to Kangana | Sakshi
Sakshi News home page

మరో వివాదంలో నటి.. లీగల్‌ నోటీసులు

Published Fri, May 19 2017 1:58 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

మరో వివాదంలో నటి.. లీగల్‌ నోటీసులు - Sakshi

మరో వివాదంలో నటి.. లీగల్‌ నోటీసులు

ముంబయి: బాలీవుడ్‌ ప్రముఖ నటి కంగనా రనౌత్‌ను మరో వివాదం చుట్టుముట్టింది. ఇటీవల తను నటించిన సిమ్రాన్‌ సినిమా టైటిల్స్‌లో అడిషనల్‌ స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌ కంగనా అంటూ ఆమె పేరు వేసి క్రెడిట్‌ ఇవ్వడంపై ఈ సినిమాకు మాటలు అందించిన అపూర్వ అస్రాని తీవ్ర అభ్యంతరం చెప్పగా ఇప్పుడు మరో బాలీవుడ్‌ దర్శకుడు నిర్మాత కేతన్‌ మెహతా ఆమెకు లీగల్‌ నోటీసులు పంపారు. తన డ్రీమ్‌ ప్రాజెక్టు ‘రాణి ఆఫ్‌ జాన్సీ: ది వారియర్‌ క్వీన్‌’ చిత్రంలో నటిస్తానని చెప్పిన కంగనా ఇప్పుడు మణికర్ణిక-ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ చిత్రంలో నటిస్తూ తన డ్రీమ్‌ ప్రాజెక్టును హైజాక్‌ చేసిందంటూ  నోటీసుల్లో పేర్కొన్నారు.

‘మేం కంగనాకు నోటీసులు పంపించాం. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. అయితే, ఇదే సబ్జెక్టుతో ఇటీవల ఆమె మరో చిత్రాన్ని చేస్తుందని మాకు ఇటీవలె తెలిసిందే. అందుకే మేం చట్టబద్ధంగా దీనిని ఎదుర్కోబోతున్నాం’ అని మెహతా చెప్పారు. సర్వం సిద్ధం చేసుకున్నాక తమ ప్రాజెక్టును హైజాక్‌ చేయడం విశ్వాస ఘాతుకమేనని, ఈ విషయాన్ని అంతతేలికగా వదిలిపెట్టబోమంటూ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement