ఆ క్యారెక్టర్కి సూట్ అవుతుందా..? | kriti kharbanda romance with imran hasmi | Sakshi
Sakshi News home page

ఆ క్యారెక్టర్కి సూట్ అవుతుందా..?

Published Sun, Nov 22 2015 9:29 AM | Last Updated on Sun, Sep 3 2017 12:51 PM

ఆ క్యారెక్టర్కి సూట్ అవుతుందా..?

ఆ క్యారెక్టర్కి సూట్ అవుతుందా..?

సౌత్ ఇండస్ట్రీలో పక్కింటి అమ్మాయిలా అలరిస్తున్న కృతి కర్బంద, బాలీవుడ్లో మాత్రం హద్దు మీరుతున్నట్టుగా కనిపిస్తోంది. తెలుగు తమిళ భాషల్లో సాంప్రదాయబద్ధంగా కనిపించే పాత్రల్లో మాత్రమే చేసిన ఈ భామ, రాజ్ సీరీస్లోనటించడానికి రెడీ అవుతోంది. బాలీవుడ్ 'సీరియల్ కిస్సర్' ఇమ్రాన్ హష్మీతో కలిసి రాజ్ 4లో నటించడానికి అంగీకరించింది ఈ బ్యూటి.

ఇమ్రాన్ హష్మీ సినిమాకు బాలీవుడ్లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఈ హీరో సినిమాల్లో అవసరం ఉన్నా లేకపోయినా ఘాటు ముద్దు సీన్లు, హాట్ బెడ్రూం సీన్లు తప్పకుండా ఉండేలా చూస్తారు దర్శకనిర్మాతలు. అయితే ఇప్పటి వరకు బాలీవుడ్ భామలే, ఈ హీరోతో నటించారు కనుక సౌత్ జనాలు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. అయితే కృతి లాంటి హోమ్లీ హీరోయిన్ ఇమ్రాన్ హష్మీతో నటిస్తుండటంతో ఇప్పుడు ఈ వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement