నాగచైతన్యకు జోడీగా? | krutisana get a chance acting with naga chaitanya | Sakshi
Sakshi News home page

నాగచైతన్యకు జోడీగా?

Published Fri, May 2 2014 10:42 PM | Last Updated on Sat, Sep 2 2017 6:50 AM

నాగచైతన్యకు జోడీగా?

నాగచైతన్యకు జోడీగా?

 మహేశ్‌బాబు ‘1’ చిత్రం కథానాయిక కృతీసనన్ తెలుగులో మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు చిత్ర పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. నాగచైతన్యతో కలిసి ఈ ముద్దుగుమ్మ నటించనుందట. ‘స్వామి రారా’ చిత్రంతో దర్శకునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్‌వర్మ దర్శకత్వంలో, బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకోసం ముంబైలో ఏర్పాటు చేసిన ఫొటోషూట్‌లో కూడా కృతి పాల్గొన్నట్లు వినికిడి. జూన్‌లో ఈ చిత్రం షూటింగ్ మొదలుకానుంది. తొలి సినిమా ‘1’ తోనే తెలుగు తెరకు మరో గ్లామర్‌తార దొరికిందని అందరి ప్రశంసలూ అందుకుంది కృతీసనన్. నటిగా కూడా మంచి మార్కులే కొట్టేసింది తను. కచ్చితంగా కృతికి మంచి అవకాశాలొస్తాయని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లే నాగచైతన్య చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. కృతి ఇటీవలే హిందీలో ‘హీరో పంటి’(తెలుగు ‘పరుగు’కి రీమేక్) చిత్రంలో నటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement