
ఈ నెలాఖరున రానున్న 'లయన్'
హైదరాబాద్: నందమూరి అభిమానుల ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న 'లయన్' ఈ నెలాఖరున విడుదల కానుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాను వేసవి స్పెషల్ గా ఏప్రిల్ 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'లెజెండ్' హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో భారీగా అంచనాలు ఉన్నాయి.
బాలకృష్ణ సరసన తొలిసారిగా త్రిష నటించింది. రాధికా ఆప్టే మరో హీరోయిన్ గా చేసింది. బాలకృష్ణ శక్తిమంతమైన సీబీఐ అధికారిగా భిన్నకోణాల్లో నటిస్తోన్న ఈ చిత్రం అభిమానులను అలరిస్తుందని దర్శకుడు సత్యదేవ్ నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు.