
సెలబ్రిటీ సంపాదనలో మడోనా టాప్
ప్రముఖ పాప్ సింగర్ మడోనా(53) ఫోర్బ్స్ అత్యంత సంపాదపరుల సెలబ్రిటీ జాబితా- 2013లో అగ్రస్థానంలో నిలిచింది. ఎండీఎన్ఏ పర్యటనతో 'మెటిరీయల్ గాల్' హిట్ మేకర్ ఫోర్బ్స్ మేగజీన్ వార్షిక నివేదికలో మొదటి స్థానం దక్కించుకుంది. 2012 జూన్-2013 జూన్ మధ్య కాలంలో మడోనా సంపాదన125 మిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ పేర్కొంది.
విఖ్యాత దర్శకుడు స్పీల్ బర్గ్ 100 మిలియన్ డాలర్ల సంపాదనతో మడోనా తర్వాతి స్థానంలో నిలిచారు. '50 షేడ్స్ ఆఫ్ గ్రే' రచయిత ఈఎల్ జేమ్స్, హోవార్ట్ స్టెన్, మీడియా మొఘల్ సిమన్ కోవెల్ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. వీరి వార్షికాదాయం 95 విలియన్ డాలర్ల చొప్పున ఫోర్బ్స్ లెక్కగట్టింది.