Pop diva Madonna
-
ఫిట్నెస్ సీక్రెట్ వెల్లడించిన మడోనా..
న్యూయార్క్ : పాప్ క్వీన్, ప్రముఖ నటి మడోనా తన గాత్రంతో దశాబ్ధాలుగా యువతను ఉర్రూతలూగించారు. లైక్ ఏ వర్జిన్, ఎవిరిబడీ, బర్నింగ్ అప్, మెటీరియల్ గర్ల్, ఫ్రోజెన్ వంటి ఆల్బమ్స్‌తో మడోనా పాప్ మ్యూజిక్కు గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగారు. తన గాత్రం, అందంతోనే కాకుండా ఆమె వివాదాలతోనూ నెట్టింట్లో హల్చల్ చేస్తుంటారు. ఇక తన ఫిట్నెస్ సీక్రెట్స్ గురించి మడోనా ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.చల్లని నీటి టబ్‌లో కూర్చుంటూ ఐస్ బాత్ చేస్తూ ఈ వీడియోలో మడోనా కనిపించారు. తన ఫిట్‌నెస్‌కు ఐస్ బాత్‌తో పాటు స్వయంగా తన మూత్రాన్నే సేవిస్తానని ఇవే తాను శారీరకంగా ఫిట్‌గా ఉండటానికి కారణమని ఆమె తన అభిమానులకు చెప్పుకొచ్చారు. -
సెలబ్రిటీ సంపాదనలో మడోనా టాప్
ప్రముఖ పాప్ సింగర్ మడోనా(53) ఫోర్బ్స్ అత్యంత సంపాదపరుల సెలబ్రిటీ జాబితా- 2013లో అగ్రస్థానంలో నిలిచింది. ఎండీఎన్ఏ పర్యటనతో 'మెటిరీయల్ గాల్' హిట్ మేకర్ ఫోర్బ్స్ మేగజీన్ వార్షిక నివేదికలో మొదటి స్థానం దక్కించుకుంది. 2012 జూన్-2013 జూన్ మధ్య కాలంలో మడోనా సంపాదన125 మిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ పేర్కొంది. విఖ్యాత దర్శకుడు స్పీల్ బర్గ్ 100 మిలియన్ డాలర్ల సంపాదనతో మడోనా తర్వాతి స్థానంలో నిలిచారు. '50 షేడ్స్ ఆఫ్ గ్రే' రచయిత ఈఎల్ జేమ్స్, హోవార్ట్ స్టెన్, మీడియా మొఘల్ సిమన్ కోవెల్ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. వీరి వార్షికాదాయం 95 విలియన్ డాలర్ల చొప్పున ఫోర్బ్స్ లెక్కగట్టింది.