
న్యూయార్క్ : పాప్ క్వీన్, ప్రముఖ నటి మడోనా తన గాత్రంతో దశాబ్ధాలుగా యువతను ఉర్రూతలూగించారు. లైక్ ఏ వర్జిన్, ఎవిరిబడీ, బర్నింగ్ అప్, మెటీరియల్ గర్ల్, ఫ్రోజెన్ వంటి ఆల్బమ్స్‌తో మడోనా పాప్ మ్యూజిక్‌కు గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగారు. తన గాత్రం, అందంతోనే కాకుండా ఆమె వివాదాలతోనూ నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంటారు. ఇక తన ఫిట్‌నెస్ సీక్రెట్స్ గురించి మడోనా ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.చల్లని నీటి టబ్‌లో కూర్చుంటూ ఐస్ బాత్ చేస్తూ ఈ వీడియోలో మడోనా కనిపించారు. తన ఫిట్‌నెస్‌కు ఐస్ బాత్‌తో పాటు స్వయంగా తన మూత్రాన్నే సేవిస్తానని ఇవే తాను శారీరకంగా ఫిట్‌గా ఉండటానికి కారణమని ఆమె తన అభిమానులకు చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment