
స్క్రీన్ టెస్ట్
► ఈ సినిమాకు మహేశ్‌బాబు ఒక్క రూపాయి తీసుకోలేదు. రెమ్యునరేషన్ లేకుండా ఫ్రీగా చేశారు!
ఎ) అతడు బి) ఒక్కడు సి) దూకుడు డి) టక్కరి దొంగ
► రాజమౌళి ‘సింహాద్రి’ కథను ముందు ఈ హీరోకి చెబితే... ఆయన తీసిన ‘స్టూడెంట్ నెం1’ నచ్చక రిజెక్ట్ చేశారట!
ఎ) ప్రభాస్ బి) రవితేజ సి) రామ్‌చరణ్ డి) నాగార్జున
►చెన్నైలోని ఏ కాలేజీలోనూ ఈ హీరోకి అడ్మిషన్ దొరకలేదంట! దాంతో హైదరాబాద్ వచ్చేశారు. నేనంత బ్యాడ్ స్టూడెంట్‌అంటూసరదాగా ఈ మేటర్ చెప్పిన హీరో ఎవరు?
ఎ) నాగచైతన్య బి) రామ్‌చరణ్ సి) అల్లు అర్జున్ డి) మంచు మనోజ్
► సమంత ఏ తమిళ హీరోకి పెద్ద ఫ్యాన్? చిన్న హింట్: చెన్నై కాలేజ్ డేస్‌లో ఆయన సినిమాలు చూడడానికి క్లాసులు కూడా బంక్ కొట్టేవారు!
ఎ) రజనీకాంత్ బి) సూర్య సి) విక్రమ్ డి) విజయ్
► ‘పరెషానురా... పరెషానురా’ పాటలో రకుల్‌ను చూసి కుర్రాళ్లు పరేషానయ్యారు. ‘ధృవ’లోని ఈ పాట తొలి చరణం ఏ వాక్యంతో మొదలవుతుంది?
ఎ) ఒక తికమక మతలబులో...బి) ప్యారులో ప్రతి మలుపు తీన్మారురా...
సి) ప్రేమన్నదే పరెషానురా...డి) ఒక రేయిని పగటిని...
► ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’లో హీరోయిన్ డి.సుప్రియ ఏ స్టార్ హీరో మేనకోడలు?
ఎ) నాగార్జున బి) వెంకటేశ్ సి) చిరంజీవి డి) కృష్ణ
► ‘ఎవడు’లో శ్రుతీహాసన్ ఓ హీరోయిన్. శ్రుతీ కంటే ముందు ఆ ప్లేస్ ఎవరిది? కొన్ని రోజులు షూటింగ్ కూడా చేసిన తర్వాత ఆమెను పక్కన పెట్టి శ్రుతీహాసన్‌ను తీసుకున్నారు!
ఎ) రాశీ ఖన్నా బి) లావణ్యా త్రిపాఠి సి) తమన్నా డి) సమంత
► ‘వాసివాడి తస్సాదియ్యా..’ గోదావరి యాసలో నాగార్జున చెప్పిన ఈ డైలాగ్ ఎంత హిట్టో... సినిమా కూడా అంతే హిట్టు! ఆ సినిమా ఏది?
ఎ) హలో బ్రదర్ బి) సోగ్గాడే చిన్ని నాయనా సి) నిన్నే పెళ్ళాడతా డి) ఆవిడా మా ఆవిడే
► ఇప్పుడు సినిమాల్లో రెయిన్ ఎఫెక్ట్ కోసం ఈ టెక్నిక్ వాడుతున్నారు!
ఎ) వాటర్ ట్యాంకర్లు, ఫైర్ ఇంజిన్ల ద్వారా నీటిని గాల్లో చిమ్మడం బి) నిజంగా వర్షం వచ్చినప్పుడే షూటింగ్ చేయడం
సి) వర్షాన్ని, సీన్లను సపరేట్‌గా షూట్ చేసి ఎడిటింగ్‌లో మిక్స్ చేయడం డి) గ్రాఫిక్స్, సీజీ వర్క్ ద్వారా వర్షాన్ని సృష్టించడం
► ‘కోత మొదలైంది. రాత రాసిన భగవంతుడు వచ్చినా ఆపలేడు’ అంటూ ఆవేశంతో ఊగుతూ విలన్లను ఎన్టీఆర్ ఊచకోత కోసిన ఫైట్ ఏ సిన్మాలోనిది?
ఎ) దమ్ము బి) రభస సి) సింహాద్రి డి) అశోక్
► వెంకటేశ్‌ను డైరెక్ట్ చేసిన ఫస్ట్ లేడీ డైరెక్టర్ ఎవరు?
ఎ) విజయనిర్మల బి) నందినీరెడ్డి సి) సుధ కొంగర డి) శ్రీప్రియ
► పెదనాన్న కృష్ణంరాజు, ప్రభాస్‌లు తండ్రీ కొడుకులుగా నటించిన సినిమా ఏది?
ఎ) బిల్లా బి) రెబల్ సి) పౌర్ణమి డి) యోగి
► దర్శకుడిగా రాఘవేంద్రరావు ఎప్పుడో సెంచరీ దాటేశారు. ఆ సెంచరీలో 24 రన్స్... అదేనండీ 24 సినిమాల్లో ఈవిడే హీరోయిన్!
ఎ) శ్రీదేవి బి) జయసుధ సి) జయప్రద డి) శారద
► సుహాసిని ఏ స్టార్ హీరో అన్న కూతురు?
ఎ) ఎస్వీ రంగారావు బి) శోభన్‌బాబు సి) కమల్ హాసన్ డి) రజనీకాంత్
► అమితాబ్ బచ్చన్ ‘బుడ్డా హోగా తేరా బాప్’ దర్శకుడు మన తెలుగోడే. ఆయనెవరో చెప్పుకోండి!
ఎ) పూరి జగన్నాథ్ బి) శ్రీను వైట్ల సి) రామ్‌గోపాల్ వర్మ డి) క్రిష్ జాగర్లమూడి
► త్వరలో చిత్రీకరణ మొదలు కానున్న అల్లు అర్జున్ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్న స్టార్ రైటర్?
ఎ) దీపక్ రాజ్ బి) అబ్బూరి రవి సి) బుర్రా సాయిమాధవ్ డి) వక్కంతం వంశీ
► ‘నాన్నా.. పందులే గుంపుగా వస్తాయి. సింహం సింగిల్‌గా వస్తుంది’ – రజనీకాంత్ ఈ డైలాగ్ చెబుతుంటే ఫ్యాన్స్ విజిల్స్ వేశారు. కానీ, ఆ వాయిస్ ఆయనది కాదు. మరి, ‘శివాజీ’లో రజనీకు డబ్బింగ్ చెప్పింది ఎవరు?
ఎ) ఎస్పీ బాలు బి) రవిశంకర్ సి) మనో (నాగూర్‌బాబు) డి) సాయికుమార్
► ఏ హీరోయిన్ ‘100% లవ్’లోని ‘ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ఎ ప్లస్ బి హోల్ స్క్వేర్’ సాంగ్ ప్లేబ్యాక్ సింగర్?
ఎ) మధుశాలిని బి) స్వాతి సి) రాశీ ఖన్నా డి) మమతా మోహన్‌దాస్
► ఎన్టీఆర్, వాణిశ్రీ జంటగా ఉన్న ఈ స్టిల్ ఏ సిన్మాలోనిది?
ఎ) నిండు మనసు బి) ఆరాధన సి) భలే రంగడు డి) బంగారు పంజరం
► ఈ ఫొటోలోని ఇద్దరూ స్టార్ ఫ్యామిలీ వారసులు, ఇప్పటి యంగ్ హీరోలు. వాళ్లు ఎవరో చెప్పుకోండి?
ఎ) రానా–నాగచైతన్య బి) కల్యాణ్‌రామ్–ఎన్టీఆర్ సి) రామ్‌చరణ్–వరుణ్‌తేజ్ డి) సాయిధరమ్‌తేజ్–వరుణ్‌తేజ్
మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాల వరకూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి!
సమాధానాలు
1) డి 2) ఎ 3) ఎ 4) బి 5) ఎ 6) ఎ 7) డి 8) బి 9) ఎ 10) ఎ 11) డి 12) బి 13) ఎ 14) సి 15) ఎ 16) డి 17) సి 18) బి 19) బి 20) డి