మహేశ్ ఎవరిని ఫాలో అవుతాడు? | mahesh babu follows only one person in twitter | Sakshi
Sakshi News home page

మహేశ్ ఎవరిని ఫాలో అవుతాడు?

Published Fri, Apr 8 2016 12:58 PM | Last Updated on Sun, Sep 3 2017 9:29 PM

మహేశ్ ఎవరిని ఫాలో అవుతాడు?

మహేశ్ ఎవరిని ఫాలో అవుతాడు?

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు అభిమానుల సంఖ్య ఎక్కువే. అందులోనూ సూపర్ స్టార్ కృష్ణ అభిమానులలో చాలామంది ఆ తర్వాత మహేశ్ వైపు వచ్చారు. పైగా యువతరంలోను, విద్యార్థి లోకంలో కూడా ఆయనకు కావల్సినంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. ట్విట్టర్‌లో మరీ అంత ఎక్కువగా కాకపోయినా ఓ మాదిరి యాక్టివ్‌గా ఉండే మహేశ్‌ను 2.02 మిలియన్ల మంది అభిమానులు ఫాలో అవుతున్నారు. అంటే 20 లక్షల మందికి పైగా అన్న మాట. మరి మహేశ్ ఎంతమందిని ఫాలో అవుతున్నారన్న ప్రశ్న కూడా చాలామందికి వస్తుంది. అందుకోసం ఆయన ట్విట్టర్ పేజీలోకి వెళ్లి చూస్తే.. కేవలం ఒకే ఒక్కరిని మహేశ్ ఫాలో అవుతున్నాడు.

ఆ ఒక్కరూ ఎవరో తెలుసా.. ఆయన బావ, పారిశ్రామిక వేత్త గల్లా జయదేవ్. గుంటూరు నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తనకు నచ్చిన దర్శకులు, హీరోలు, హీరోయిన్లు.. ఇలా చాలామంది ఉన్నా కూడా వాళ్లెవరినీ ట్విట్టర్‌లో మహేశ్ ఫాలో కావడం లేదు. కేవలం గల్లా జయదేవ్‌ను మాత్రమే ఫాలో అవుతున్నారు. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ లాంటి వాళ్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లాంటి రాజకీయ ప్రత్యర్థులను కూడా ఫాలో అవుతారు. కానీ మహేశ్ మాత్రం 'నలుగురికీ నచ్చినదీ నాకసలే ఇక నచ్చదురో' అనుకుంటూ.. తనదైన దారిలోనే వెళ్తున్నారన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement