'బ్రహ్మోత్సవం ఫెయిల్యూర్కు నాదే బాధ్యత' | Mahesh Babu: I want to take the responsibility for Brahmotsavam's failure | Sakshi
Sakshi News home page

'బ్రహ్మోత్సవం ఫెయిల్యూర్కు నాదే బాధ్యత'

Published Sat, May 28 2016 6:30 PM | Last Updated on Mon, Sep 4 2017 1:08 AM

'బ్రహ్మోత్సవం ఫెయిల్యూర్కు నాదే బాధ్యత'

'బ్రహ్మోత్సవం ఫెయిల్యూర్కు నాదే బాధ్యత'

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు భారీ విజయం తర్వాత విడుదలైన ఆయన సినిమా బ్రహ్మోత్సవంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మహేష్ అభిమానుల అంచనాలను బ్రహ్మోత్సవం అందుకోలేకపోయింది. అభిమానులను నిరాశపరిచిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించలేకపోయింది.

బ్రహ్మోత్సవం ఫెయిల్యూర్కు దర్శకుడిని నిందించరాదని మహేష్ బాబు అన్నాడు. ఓ జాతీయ వార్త సంస్థతో మహేష్ మాట్లాడుతూ.. ఈ సినిమా పరాజయానికి పూర్తిగా తనదే బాధ్యతని చెప్పాడు. ఓ సినిమా హిట్ కావడానికి, కాకపోవడానికి ఎన్నో కారణాలుంటాయని అన్నాడు. దర్శకుడిని ఎంచుకోవడమన్నది తన నిర్ణయమని, నా అభిప్రాయం తప్పుకావచ్చని మహేష్ చెప్పాడు.

మహేష్ సరసన సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత నటించిన ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇంకా సత్యారాజ్, రావు రమేష్, నరేశ్, రేవతి, సాయాజీ షిండే తదితర భారీ తారగణం నటించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement