
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం మహర్షి. భరత్ అనే నేను చిత్రంతో మంచి హిట్‌ను సొంతం చేసుకున్న మహేష్.. మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఉగాది కానుకగా.. మహర్షి మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
క్లాస్‌ను మాస్‌ను టచ్ చేసిన ఈ టీజర్.. సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. స్టైలీష్ లుక్‌తో పాటు, మాస్ ప్రేక్షకులు మెచ్చే విధంగానూ.. యాక్షన్‌తో అదరగొట్టేశాడు మహేష్. ఈ టీజర్‌ను ఇప్పటికే ఆరు మిలియన్ల మంది వీక్షించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.