'పర్సనల్ విషయాలు అడగొద్దు'
న్యూఢిల్లీ: వ్యక్తిగత ప్రశ్నలకు దూరంగా ఉంటోంది బాలీవుడ్ నటి మలైకా ఆరోరా. భర్త అర్బాజ్ ఖాన్ తో ఆమె తెగతెంపులు చేసుకోనుందని వస్తున్న వార్తల నేపథ్యంలో పర్సనల్ విషయాలు బయటకు చెప్పకూడదని మలైకా నిర్ణయించకుంది. మందిరా విర్క్ ఫ్యాషన్ షో కోసం ఆదివారం ఢిల్లీకి వచ్చిన ఆమె.. ఎవరూ తన వ్యక్తిగత విషయాలు అడగొద్దని కోరింది.
చాలా కాలం తర్వాత ఢిల్లీకి వచ్చానని, మందిరా విర్క్ కోసమే తానిక్కడకు వచ్చానని వెల్లడించింది. మందిర తనకు మంచి స్నేహితురాలని చెప్పింది. తానెప్పుడు ఇక్కడకు వచ్చినా ఇద్దరం కలిసి బయటకు వెళతామని, కష్టసుఖాలు కలబోసుకుంటామని వెల్లడించింది.
ష్యాషన్ షో మొదలు కావడానికి కొద్ది రోజుల ముందు వేదిక వద్దకు వచ్చిన మలైకా... షో ముగియగానే వెళ్లిపోయింది. వ్యక్తిగత జీవితం గురించి ఎవరైనా అడుగుతారనే ఉద్దేశంతోనే ఆమె ఇలా వ్యవహరించినట్టు తెలుస్తోంది. అయితే విడాకుల గురించి అర్బాజ్ ఖాన్, మలైకా ఆరోరా ఇప్పటివరకు పెదవి విప్పలేదు.