లైన్‌ నచ్చితేనే కథ వింటానన్నా! | Manchu Manoj Gunturodu Movie Teaser is Out: Manoj, Pragya Jaiswa | Sakshi
Sakshi News home page

లైన్‌ నచ్చితేనే కథ వింటానన్నా!

Published Mon, Dec 12 2016 11:42 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

లైన్‌ నచ్చితేనే కథ వింటానన్నా! - Sakshi

లైన్‌ నచ్చితేనే కథ వింటానన్నా!

– హీరో మనోజ్‌
మిర్చి యార్డులోని ఆ కుర్రాడి కొట్టుడు చూసి... వీడెవడు గుంటూరు ఘాటు మిరపకాయ్‌ అమ్మా మొగుడిలా ఉన్నాడని అక్కడున్నవాళ్లు అంటారు. ఆ కుర్రాడు ‘నేను కొడితే ఒంట్లోని 206 ఎముకలు ఒకేసారి విరిగిపోతాయ్‌’ అని వార్నింగ్‌లు ఇస్తున్నాడు. అతడి కథేంటో ‘గుంటూరోడు’లో చూడాలి మరి! మంచు మనోజ్, ప్రజ్ఞా జైస్వాల్‌ జంటగా ఎస్‌.కె. సత్య దర్శకత్వంలో శ్రీవరుణ్‌ అట్లూరి నిర్మిస్తున్న సినిమా ‘గుంటూరోడు’. సోమవారం టీజర్‌ విడుదల చేశారు. మనోజ్‌ మట్లాడుతూ – ‘‘నాకు కొత్త కథలంటే ఆసక్తి. సత్య పక్కా కమర్షియల్‌ సినిమా చేద్దామన్నాడు. లైన్‌ నచ్చితేనే కథ వింటానన్నా.

అందమైన ప్రేమకథకు మాస్‌ కమర్షియల్‌ అంశాలు జోడించి మంచి కథ చెప్పాడు. సినిమాను కూడా అద్భుతంగా తీశాడు. నిర్మాత వరుణ్‌ నా స్నేహితుడే. నిర్మాణంలో రాజీ పడలేదు’’ అన్నారు. ‘‘మనోజ్‌ ప్రేమించి చేసిన చిత్రమిది. టీజర్‌ కంటే ట్రైలర్‌ బాగుంటుంది. సినిమా అంత కంటే బాగుంటుంది’’ అన్నారు ఎస్‌.కె. సత్య. ‘‘జనవరి నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు శ్రీవరుణ్‌ అట్లూరి. దర్శకులు బాబీ, కాశీ విశ్వనాథ్, నిర్మాత అనిల్‌ సుంకర, చిత్ర సంగీత దర్శకుడు శ్రీవసంత్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement