కామెడీ, సాంగ్స్‌ లేకుండా యంగ్‌ హీరో ప్రయోగం | Manchu Manoj Okkadu Migiladu Movie updates | Sakshi
Sakshi News home page

కామెడీ, సాంగ్స్‌ లేకుండా యంగ్‌ హీరో ప్రయోగం

Published Sun, Oct 29 2017 11:13 AM | Last Updated on Sun, Oct 29 2017 11:13 AM

Manchu Manoj Okkadu Migiladu Movie updates

స్టార్‌ వారసుడిగా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్‌, నటుడిగా మంచి మార్కులు సాధించినా, సక్సెస్‌ సాధించటంలో మాత్రం ఫెయిల్‌ అవుతున్నాడు. రొటీన్‌ ఫార్ములాకు భిన్నంగా సినిమాలు చేస్తున్న మనోజ్‌ మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఎల్టీటీయి నాయకుడు ప్రభాకరన్‌ జీవిత‍కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమాలో ప‍్రభాకరన్‌ పాత్రతో పాటు విద్యార్థి నాయకుడిగా నటిస్తున్నాడు మనోజ్‌.

సినిమా విశేషాలపై అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ సినిమాలో కామెడీ, పాటలు ఉండవని కేవలం ఒక్క బ్యాక్‌ గ్రౌండ్‌ సాంగ్‌ మాత్రమే ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు ఈ సినిమాలో ప్రేమకథ కూడా ఉండదని తెలిపారు. అజయ్‌ ఆండ్రూస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ఈ సినిమా నవంబర్‌ 10న రిలీజ్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement