
అభిమానులకు హీరోయిన్ హెచ్చరిక!
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ మనీషా కొయిరాలా అభిమానులకు హెచ్చరిక జారీ చేసింది. ఫ్యాన్స్ పై ఆమెకు కోపం వచ్చిందని అపార్థం చేసుకోకండి. ఫేస్ బుక్ లో తన పేరుతో లెక్కకు మిక్కిలిగా ఉన్న నకిలీ అకౌంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అభిమానులకు సూచించింది. 'ఫేస్ బుక్ లో నా పేరుతో చాలా నకిలీ అకౌంట్లు ఉన్నాయి. వీటికి స్పందిచకండి' అని మనీష ట్వీట్ చేసింది.
అలాగే తన మాతృభూమి నేపాల్ లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపైనా ఆమె స్పందించింది. వ్యతిరేకించడానికి తుపాకులకు బదులుగా శాంతియుత మార్గం ఎంచుకోవాలని సూచించింది. ఒవేరియన్ కేన్సర్ బారిన పడి, చికిత్స చేయించుకున్న ఆమె ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నానని వెల్లడించింది.