
పెళ్లి చూపులు సినిమాతో తనను హీరోగా నిలబెట్టిన దర్శకుడిని వెండితెరపై హీరోగా పరిచయం చేసేందుకు విజయ్ దేవరకొండ సిద్దమయ్యాడు. తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రం మూవీ టీజర్‌ను కాసేపటి క్రితమే విడుదల చేశారు.
తరుణ్ భాస్కర్, అనసూయ, అభినవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మీకు మాత్రమే చెప్తా అనే చిత్రం.. ఫస్ట్ లుక్‌తోనే ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు. ప్రతీ ఫోన్‌లో సీక్రెట్స్ ఉంటాయి అని తెలిపేట్టుగా కట్ చేసిన ఈ టీజర్ ఆసక్తికరంగా ఉంది. 'సిగరెట్,మందు తాగడం, అబద్దాలు చెప్పడం ఆరోగ్యానికి హానికరం అంటూ ముగిసిన ఈ టీజర్‌లో తరుణ్ భాస్కర్ హైలెట్‌గా నిలిచాడు. షమీర్ సుల్తాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment