శృంగార సన్నివేశాలకు నో..
శృంగార సన్నివేశాలకు నో..
Published Wed, Apr 2 2014 6:10 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
శృంగార సన్నివేశాల్లో నటించడం తనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని బాలీవుడ్ నటి మీరా చోప్రా చెప్పారు. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు వరుసకు సోదరి అయిన మీరా చోప్రా తాను శృంగార సన్నివేశాలకు అన్‌ఫిట్ అని స్పష్టం చేసింది. ‘అవునండీ.. శరీరమంతా కనిపించేలా దుస్తులు, స్విమ్మింగ్ సూట్ వంటివి ధరించడం నాకు అంతగా నచ్చదు. నా వరకు నాకు కుటుంబ తరహా పాత్రలనే ఎక్కువగా చేయడానికి ఇష్టపడతాను.. అందుకే శృంగార సన్నివేశాలు చేయాల్సి వచ్చే సినిమాలను కూడా తిరస్కరిస్తున్నాను.. ఈ నిర్ణయం నాకు నేను తీసుకున్నదే కాబట్టి మున్ముందు అవకాశాలు తగ్గినా ఇబ్బంది పడను..’ అని చెప్పింది. ‘గ్యాంగ్ ఆఫ్ ఘోస్ట్స్’ సినిమాలో హీరోయిన్‌గా చేసిన మీరా చోప్రా భవిష్యత్తులో న్యూయార్క్‌లో ఫ్యాషన్ హౌస్‌ను ప్రారంభించాలని ఆలోచిస్తున్నానంది.
‘నేను న్యూయార్క్‌లో ఉండేదాన్ని కాబట్టి అక్కడి విషయాలు గురించి నాకు అవగాహన ఉంది. ఫ్యాషన్ హౌస్ ఏర్పాటు నా చిరకాల వాంఛ.. అందుకే నటనతో పాటు వేరే ఏమైనా చేయాలని నాకు అనిపించినప్పుడు తప్పకుండా న్యూయార్క్‌లో ఫ్యాషన్ వ్యాపారం మొదలుపెడతా’నని చెప్పింది. ‘గ్యాంగ్ ఆఫ్ ఘోస్ట్స్’ తర్వాత తాను చాలా కథలు వింటున్నానని చెప్పింది. మనసుకు నచ్చిన కథ దొరికిన వెంటనే ఓకే చెబుతానంది. కాగా ప్రస్తుతం ‘1920 లండన్’ అనే చిత్రంలో నటిస్తున్నానని మీరా చోప్రా వివరించింది. ఈ సినిమా భిన్న కథాంశంతో కూడుకున్నదని ఆమె వివరించింది. ఇదిలా ఉండగా మీరాచోప్రా బాలీవుడ్‌లోనే కాకుండా పలు ప్రాంతీయ భాషా చిత్రాల్లోనూ హీరోయిన్‌గా నటించింది. ఆమె తెలుగు, తమిళ భాషా చిత్రాల్లో చేసిన పలు పాత్రలు ప్రేక్షకుల ప్రశంసలందుకున్నాయి.
Advertisement
Advertisement