నాని హీరోయిన్కి బన్నీ ఛాన్స్ | Mehrene kaur in Allu arjun Next | Sakshi
Sakshi News home page

నాని హీరోయిన్కి బన్నీ ఛాన్స్

Published Sat, Sep 3 2016 2:45 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

నాని హీరోయిన్కి బన్నీ ఛాన్స్

నాని హీరోయిన్కి బన్నీ ఛాన్స్

కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటి, చాలా రోజులుగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. ఒకటి రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చినా.. కెరీర్ను మలుపు తిప్పే స్థాయిలో మాత్రం ఒక్క స్టార్ హీరో కూడా చాన్స్ ఇవ్వలేదు.

తాజాగా అలాంటి క్రేజీ ఆఫర్ ఒకటి మెహ్రీన్ తలుపు తట్టింది. అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిజె దువ్వాడ జగన్నామ్ సినిమాకు మెహ్రీన్ను హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. ముందుగా ఈ సినిమాకు కాజల్ను తీసుకోవాలని భావించినా.. రెమ్యూనరేషన్ విషయంలో బెట్టు చేయటంతో మెహ్రీన్ వైపు చూస్తున్నారు. ఒకసారి మెగా కాంపౌండ్లో అడుగుపెడితే ఇక మెగా హీరోలు వరుసగా ఛాన్స్లు ఇస్తారు కాబట్టి ఈ సినిమా కన్ఫామ్ అయితే మెహ్రీన్ పంట పండినట్టే అన్నటాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement