
అఖిల్, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై ‘బన్నీ’ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన అఖిల్ ఫస్ట్ లుక్, హీరోయిన్ పూజా హేగ్దే లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలోని తొలిపాటను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. ‘మనసా..మనసా.. మనసారా బ్రతిలాడా.. తనవలలో పడబోకే మనసా’ అంటూ సాగే ఈ పాట శ్రోతన్ని ఆకట్టుకుంటుంది. ఈ పాటకు సురేంద్ర కృష్ణ లిరిక్స్ అందించగా.. ప్రముఖ గాయకుడుసిద్ శ్రీరామ్ ఆలపించాడు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను వేసవిలో విడుదల చేస్తున్నాం అని ప్రకటించింది చిత్రబృందం.
Comments
Please login to add a commentAdd a comment