బ్రాండెడ్ కారును కొన్న ఎంఎస్ ధోని యాక్టర్
బ్రాండెడ్ కారును కొన్న ఎంఎస్ ధోని యాక్టర్
Published Wed, Apr 12 2017 7:44 PM | Last Updated on Thu, Sep 12 2019 8:55 PM
మహింద్ర సింగ్ ధోని బయోపిక్ 'ఎంఎస్ ధోని-ది అన్టోల్డ్ స్టోరీ' సినిమాతో ఫేమస్ అయిన యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్ పుట్, బ్యూటిఫుల్ ఇటాలియన్ స్పోర్ట్స్ సెడాన్ ను సొంతం చేసుకున్నారు. మసెరటి క్వాట్రోపోర్టేను కొనుగోలు చేశారు. ఈ బ్యూటిఫుల్ కారు కొనుగోలు చేసిన విషయాన్ని యాక్టర్ ఇటీవలే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని నెటిజన్లు, అభిమానులతో పంచుకున్నారు. ఈ ఇటాలియన్ స్పోర్ట్స్ సెడాన్ తన డ్రీమ్ కారని పేర్కొన్నారు. ''నా చిన్నప్పుడు ఈ కారు చిన్న మోడల్ తో నేను ఆడుకుంటున్నా. ప్రస్తుతం ఈ బ్రాండెడ్ కారును సొంతం చేసుకున్నా'' అని తన ఫేస్ బుక్ పోస్ట్ లో చెప్పారు.
సుశాంత్ సింగ్ కు ఎంతో కాలంగా కార్లపై, బైకులపై ఆసక్తి కలిగినవారని తన పోస్టు వల్ల తెలుస్తోంది. ఇప్పటికే సుశాంత్ కు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎస్యూవీ, బీఎండబ్ల్యూ కే1300 ఆర్ మోటార్ సైకిల్ ను కలిగి ఉన్నారు. ప్రస్తుతం మసెరటి క్వాట్రోపోర్టే ఆయన సొంతమైంది. లగ్జరీ స్పోర్ట్స్ బెస్ట్ కార్లలో ఇది కూడా ఒకటి. ఈ కారు ధర రూ.1.3 కోట్ల నుంచి 2.1 కోట్ల రూపాయల వరకు ఉంటుంది.
Advertisement
Advertisement