Sushant Singh
-
సుశాంత్ మృతిలో ఆదిత్య ఠాక్రే ప్రమేయం ఉందా? దర్యాప్తు స్టేటస్ ఏంటి?
న్యూఢిల్లీ: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి రెండేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు ఈ కేసు విషయాన్ని లోక్‌సభలో లేవనెత్తారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే క్యాంప్ ఎంపీ రాహుల్ షెవాలే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంలో ఆదిత్య ఠాక్రే ప్రమేయం ఉందా? సీబీఐ దర్యాప్తు స్టేటస్ ఏమిటి? అని ప్రశ్నించారు ఎంపీ. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తికి ఆదిత్య ఠాక్రే 44 సార్లు ఫోన్ చేసినట్లు గతంలో తేలిందని గుర్తు చేశారు. లోక్‌సభలో షిండే వర్గం ఎంపీ రాహుల్ షెవాలే మాట్లాడుతూ..‘ఏయూ నుంచి రియా చక్రవర్తికి 44 సార్లు ఫోన్ వెళ్లింది. ఏయూ అంటే ఆదిత్య ఉద్ధవ్ ఠాక్రే అని బిహార్ పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ప్రస్తుత స్టేటస్ ఏంటి?’అని ప్రశ్నించారు. తిప్పికొట్టిన ఆదిత్య ఠాక్రే.. లోక్‌సభ వేదికగా తనపై చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు ఆదిత్య ఠాక్రే. సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచే వారి నుంచి ఇంతకన్నా ఎక్కువ ఊహించలేమని విమర్శలు గుప్పించారు. ‘నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నానని మాత్రమే చెప్పగలను. సొంత పార్టీకి, ఇంట్లో విధేయుడిగా ఉండని వారి నుంచి ఇంతకు మించి ఆశించలేం. ఇది కేవలం సీఎం ఏక్నాథ్ షిండే భూకుంభకోణం, రాష్ట్ర ప్రముఖులను అవమానించిన అంశాలను పక్కదారిపట్టించేందుకే చేస్తున్నారు. అలాంటి నిరాధారమైన ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు.’ అని స్పష్టం చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు రియా చక్రవర్తికి ఏయూ అనే వ్యక్తికి మధ్య పలుమార్లు ఫోన్ కాల్స్ నడిచినట్లు 2020లోనే ఓ నివేదిక వెల్లడించింది. మొత్తం 44 కాల్స్ వెళ్లినట్లు పేర్కొంది. సుశాంత్ సింగ్ మరణంపై ఆదిత్య ఠాక్రే మౌనంగా ఉండిపోవడంతో ఏయూ అంటే ఆదిత్య ఠాక్రే అని బిహార్ ప్రభుత్వం ఆరోపించింది. యాదృచ్చికంగా ఆ సమయంలో ఆదిత్య ఠాక్రే ట్విట్టర్ ఖాతా @AUThackeray అని ఉండటం ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లయింది. ఇదీ చదవండి: సుశాంత్.. నువ్వు లేకుండా జీవితం లేదు: రియా భావోద్వేగం -
సుశాంత్ ఆత్మహత్య కేసులో కొత్త మలుపు..
బాలీవుడ్ నటుడు సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసును పూర్తి చేసేందుకు సీబీఐ అమెరికాను ఆశ్రయించింది. ఈ దర్యాప్తు సంస్థ మ్యూచ్‌వల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ (MLAT) కింద డిలీట్ అయిన సుశాంత్ చాట్స్, ఈ-మెయిల్స్ డాటా కావాలని గూగుల్, ఫేస్‌బుక్‌లను కోరింది. ఇందుకు గానుకాలిఫోర్నియాలోని గూగుల్, ఫేస్బుక్ ప్రధానకార్యాలయానికి చేరుకుంది సీబీఐ. అలాగే నటుడికి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్, ఈ-మెయిల్, లింక్ ఏదైనా ఉండిపోయిందా లేదా ధ్రువీకరించాలన్నారు. ఈ కేసు పూర్తి చేయడానికి సీబీఐ ఏ చిన్న ఆధారాన్ని కూడా విడిచిపెట్టేలా లేదని తెలుస్తోంది. సుశాంత్ సింగ్ కేసులో సీబీఐ ఎలాంటి నిర్ధారణకు రాకపోయేసరికి డిలీటైన చాట్, ఈమేయిల్స్ కోరినట్లు సుశాంత్ ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ తెలిపారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14, 2020న ఆత్మహత్యకు పాల్పడిన విషయం విధితమే. ఎయిమ్స్‌లోని ఫోరెన్సిక్ బృందం సుశాంత్ మరణాన్ని ఆత్మహత్యగా ప్రకటించినప్పటికీ, సీబీఐ అది ఆత్మహత్య లేదా హత్యకు ప్రేరేపణ అని పేర్కొంది. సుశాంత్ సింగ్ మరణం తర్వాత ముంబై పోలీసులు దర్యాప్తు చేసి ఆత్మహత్యగా నిర్ధారించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని అరెస్టు అయ్యింది. ఆమె సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిందని సుశాంత్ కుటుంబ సభ్యులు ఆరోపించడంతో సుశాంత్ మరణం దేశవ్యాప్తంగా కాంట్రవర్సీ అయింది. చదవండి: దయచేసి నన్ను ఫాలో కావొద్దు అనంతరం కేసును బెదిరింపు, ప్రేరేపణ కింద నమోదు చేసి ఆ తర్వాత సీబీఐకి అప్పగించారు. సీబీఐకి బదిలీ అయిన తర్వాత సుశాంత్ ఇంట్లో ఉన్న సిబ్బంది, రియా, ఆమె సోదరుడు షోవిక్‌ల వాంగ్మూలాలను చాలాసార్లు ఏజెన్సీ నమోదు చేసింది. ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సహా మరో రెండు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. సుశాంత్ మరణానికి సంబంధించి ఎన్సీబీ అనేక మందిని అరెస్టు చేసింది, ఇందులో రియా, ఆమె సోదరుడు షోవిక్ డ్రగ్స్ కేసులో ఉన్నారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన చాట్ బయటపడిన తర్వాత దీపికా పదుకొణెతో సహా పలువురు బాలీవుడ్ యాక్టర్స్ ఏ జాబితాలో చేర్చి విచారణ జరిపారు. చదవండి: ‘సుశాంత్ సింగ్ చావును క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు...!’ నిజానిజాలను వెలికితీయడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఈ కేసులో సీబీఐ ఇంకా నిర్ధారణకు రాలేదు. దీంతో ఇప్పుడు మ్యూచ్‌వల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ (MLAT) ద్వారా యూఎస్ సహాయం కోరుతోంది. ఈ దర్యాప్తు తర్వాత సుశాంత్ సింగ్ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన మరికొన్ని వివరాలు తెలిస్తే కేసులో మరిన్నికొత్త కోణాలను చూడవచ్చు. -
పితృస్వామ్యాన్ని నాశనం చేద్దాం!
ముంబై : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో నటి రియా చక్రవర్తి అరెస్టు అయిన విషయం తెలిసిందే. సుశాంత్ కేసు విచారణలో ఆరోపణలు ఎదర్కొంటున్న ప్రధాన నిందితురాలు రియాను నార్కోటిక్స్ కంటట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టు ముందు హాజరు పరచనున్నారు. అయితే డ్రగ్ కేసులో రియా 25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు వెల్లడించింది. (డ్రగ్స్ కేసు : రియా చక్రవర్తి అరెస్ట్) ఇదిలా ఉండగా నటి రియాను ఎన్సీబీ అధికారులు నాలుగు రోజుల పాటు విచారించారు. ఈ క్రమంలో మూడో రోజు ఎన్సీబీ కార్యాలయానికి చేరుకునే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ఫోటోలు అంతలా వైరల్ అవ్వడానికి కారణం ఆమె ధరించిన టీషర్టుపై ఉన్న ప్రింట్‌యే. ఆ రోజు రియా నలుపు రంగు టీ షర్టు ధరించగా దానిపై.. ‘గులాబీలు ఎరుపు.. వైలెట్లు నీలం.. పితృస్వామ్యాన్ని అందరం నాశనం చేద్ధాం’ అంటూ రాసి ఉంది. దీనిని చాలా మంది నెటిజన్లు గుర్తించడంతో ఈ ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. (బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు: రియా) View this post on Instagram Sushant Case: बयान देने #NCB ऑफिस पहुंची रिया चक्रवर्ती, आज हो सकती है गिरफ्तारी ड्रग मामले में बड़ा खुलासा कर सकती है NCB #sushantsinghrajput #ncb #rheachakraborty #JusticeforSSR #sakshamnewsindia #sninewsagency #sninews A post shared by SNI NEWS (@sakshamnewsindia) on Sep 8, 2020 at 1:10am PDT -
సుశాంత్ క్రికెటర్ అని రాహుల్ అనలేదట!
న్యూఢిల్లీ: బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మరణావార్త యావత్ సినీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. అతడి మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం తెలిపారు. అయితే కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ పేరిట ఓ ట్వీట్ తెగ వైరల్ అయింది. దీంతో రాహుల్‌ను నెటిజన్లు ట్రోల్ చేయడం ప్రారంభించారు. అయితే ఆ ట్వీట్ ఫేక్ అని తేలింది. (అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా!) సోషల్ మీడియాలో వైరల్ అయిన ట్వీట్ ఇంతకీ ఏంజరిగిందంటే.. సుశాంత్ మరణంపై విచారం వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అయితే సుశాంత్‌ను క్రికెటర్ అన్నారంటూ ఓ స్క్రీన్ షాట్ తెగ వైరల్ అయింది. దీంతో రాహుల్‌ను నెటిజన్లు ఓ ఆటాడుకున్నారు. అయితే దీనిపై వేగంగా స్పందించిన రాహుల్ ఫాలోవర్స్.. వెంటనే అసలు ట్వీట్‌ని సోషల్ మీడియాలో షేర్ చూసి, అది ఫేక్ అని పేర్కొన్నారు. దీంతో ఈ చిన్నిపాటి వివాదం సద్దుమణిగింది. ఇక ఆదివారం తన నివాసంలో సుశాంత్ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. (సుశాంత్ సింగ్ విశేషాలెన్నో!) రాహుల్ గాంధీ చేసిన అసలు ట్వీట్ ఇది -
సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ అంత్య క్రియలు
-
బాలీవుడ్‌ను గెలిచిన సుశాంత్‌కు వీడ్కోలు
ముంబై : బాలీవుడ్ యువహీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ అంత్య క్రియలు పూర్తయ్యాయి. సోమవారం మధ్యాహ్నం ముంబైలోని విలే పార్లేలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ దహన సంస్కారాలు జరిగాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముంబైలో ప్రస్తుతం పలు లాక్ డౌన్ నిబంధనలు అమలవుతున్న సంగతి తెలిసిందే. దీంతో సుశాంత్ అంత్యక్రియలకు అత్యంత సమీప బంధువులు, కొద్దిమంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. సుశాంత్ పార్థివదేహాన్ని అంబులెన్స్‌లో కూపర్ ఆస్పత్రి నుంచి నేరుగా వహన్ హాన్స్ శ్మశానవాటికకి తరలించారు. అంబులెన్స్ ముందు సీట్లో ప్రముఖ నిర్మాత, సుశాంత్ స్నేహితుడు సందీప్ సింగ్ కూర్చోగా, అతని కుటుంబ సభ్యులు నేరుగా శ్మశాన వాటిక దగ్గరకు చేరుకున్నారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియగానే ఆయన తండ్రితో పాటు మిగతా కుటుంబ సభ్యులు పట్నా నుంచి ఆదివారం మధ్యాహ్నమే ముంబై చేరుకున్నారు. కడసారి సుశాంత్ పార్థివదేహాన్నిచూసి ఆయన తండ్రి బోరున విలపించారు. (చదవండి : సుశాంత్ ఆత్మహత్య; రియాను విచారించిన పోలీసులు) బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆకస్మిక మరణం యావత్ సినీ లోకాన్ని తీవ్రదిగ్భ్రాంతికి గురిచేసింది. కెరీర్లో మంచి స్టేజీలో ఉన్నపుడు ఆయన తీసుకున్న అనూహ్య నిర్ణయం అభిమానులతో కూడా కంటనీరు పెట్టించింది. రెండేళ్లు థియేటర్ ఆర్టిస్ట్‌గా కొనసాగిన సుశాంత్ "కిసీ దేశ్ మే హై మేరా దిల్" సీరియల్‌తో బుల్లితెరపై తెరంగ్రేటం చేశాడు. అనంతరం "కాయ్ పో చె" (2013) చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. అలా ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘పీకే’, ‘డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి" చిత్రాలు నటుడిగా అతడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితం ఆధారంగా చేసిన ‘ఎం.ఎస్. ధోనీ’తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆయన చివరిసారిగా "చిచోర్" చిత్రంలో కనిపించాడు. -
సుశాంత్ ఆత్మహత్య : విలపించిన సోదరి
ముంబై : యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ వర్గాల్లో దిగ్బ్రాంతి కలిగించింది. కెరీర్లో మంచి స్టేజీలో ఉన్నపుడు ఆయన తీసుకున్న అనూహ్య నిర్ణయం అభిమానులతో కూడా కంటనీరు పెట్టిస్తుంది. ఆదివారం మధ్యాహ్నం ముంబై, బాంద్రాలోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని సుశాంత్ ఆత్మ హత్య చేసుకున్నాడు. ఆయన మరణవార్త వినగానే బాలీవుడ్ ఇండస్త్రీ ఉలిక్కి పడింది. ఈ వార్త తమకు షాక్‌కు గురి చేసిందని, సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు బాలీవుడ్, టాలీవుడ్ చెందిన పలువురు ట్వీట్ చేశారు. సుశాంత్ మరణ వార్త విని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పట్నా నుంచి విమానంలో వచ్చేందుకు సిద్దమవుతున్నారు. కూపర్ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం సుశాంత్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఇప్పటికే కూపర్ ఆస్పత్రికి చేరుకున్న సుశాంత్ సోదరి.. తమ్ముడిని తలచుకుంటూ బోరున విలపించింది. అందరి కంటే చిన్న, అల్లారుముద్దుగా పెరిగి.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బీహార్‌లోని పాట్నాలో 1986 జనవరి 21న జన్మించాడు. అతనికి నలుగురు అక్కలు. సోదరి మిథు సింగ్ రాష్ట్ర స్థాయి క్రికెటర్. కుటుంబంలో అందరికంటే చిన్న వాడు కావడంతో అతన్ని అల్లారుముద్దుగా పెంచారు. చిన్నతనం నుంచి ఎంతో యాక్టివ్‌గా ఉండే సుశాంత్ చదువులోనూ అందరికంటే యాక్టివ్‌గా ఉండేవారు. 2002లో కన్నతల్లి మరణం సుశాంత్‌ను మానసికంగా కుంగుబాటుకు గురిచేసింది. అదే ఏడాది సుశాంత్ కుటుంబం పట్నా నుంచి ఢిల్లీకి షిప్ట్ అయింది. ఏఐఈఈఈ(AIEEE)ఆయన ఆల్ఇండియా 7వ ర్యాంకు సాధించారు. ఢిల్లీలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చేరాడు. నటుడు కావాలనే కోరికతో చివరి ఏడాది చదవు మానేసి ప్రముఖ కొరియోగ్రాఫర్ షియామాక్ ధావర్ వద్ద శిష్యునిగా చేరాడు. బుల్లితెరపై నచించడానికి ముందు పలు అవార్డు వేడుకలలో, వివిధ కార్యక్రమాల్లో డాన్సర్‌గా ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత హీరోగా మారాలనే కలతో సుశాంత్ ముంబైకి వచ్చాడు. ఎంతో కష్టపడి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. -
బ్రాండెడ్ కారును కొన్న ఎంఎస్ ధోని యాక్టర్
మహింద్ర సింగ్ ధోని బయోపిక్ 'ఎంఎస్ ధోని-ది అన్‌టోల్డ్ స్టోరీ' సినిమాతో ఫేమస్ అయిన యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్ పుట్, బ్యూటిఫుల్ ఇటాలియన్ స్పోర్ట్స్ సెడాన్ ను సొంతం చేసుకున్నారు. మసెరటి క్వాట్రోపోర్టేను కొనుగోలు చేశారు. ఈ బ్యూటిఫుల్ కారు కొనుగోలు చేసిన విషయాన్ని యాక్టర్ ఇటీవలే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని నెటిజన్లు, అభిమానులతో పంచుకున్నారు. ఈ ఇటాలియన్ స్పోర్ట్స్ సెడాన్ తన డ్రీమ్ కారని పేర్కొన్నారు. ''నా చిన్నప్పుడు ఈ కారు చిన్న మోడల్ తో నేను ఆడుకుంటున్నా. ప్రస్తుతం ఈ బ్రాండెడ్ కారును సొంతం చేసుకున్నా'' అని తన ఫేస్ బుక్ పోస్ట్ లో చెప్పారు. సుశాంత్ సింగ్ కు ఎంతో కాలంగా కార్లపై, బైకులపై ఆసక్తి కలిగినవారని తన పోస్టు వల్ల తెలుస్తోంది. ఇప్పటికే సుశాంత్ కు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎస్యూవీ, బీఎండబ్ల్యూ కే1300 ఆర్ మోటార్ సైకిల్ ను కలిగి ఉన్నారు. ప్రస్తుతం మసెరటి క్వాట్రోపోర్టే ఆయన సొంతమైంది. లగ్జరీ స్పోర్ట్స్ బెస్ట్ కార్లలో ఇది కూడా ఒకటి. ఈ కారు ధర రూ.1.3 కోట్ల నుంచి 2.1 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. -
సవాళ్లతో కూడిన సినిమా : వాణీకపూర్
న్యూఢిల్లీ: నటనలో అనుభవం లేకపోవడం వల్ల శుద్ధ్ దేసీ రొమాన్స్ షూటింగ్ సమయంలో చాలా కంగారు పడ్డానని చెప్పింది ఢిల్లీ యువతి వాణీకపూర్. ఇందులో సుశాంత్‌సింగ్, పరిణీతి చోప్రా ప్రధానపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. జైపూర్ నేపథ్యంగాసాగే ఈ ప్రేమకథను యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. ఆడిషన్లో అందరినీ మెప్పించిన వాణికి ఇందులో అవకాశం ఇచ్చారు. ఈ సంస్థ నుంచి ఎందరో పెద్ద నటులుగా ఎదిగారని, అందుకే షూటింగ్ సమయంలో ఎంతో బాధ్యతగా నడుచుకున్నానని తెలిపింది. ‘నాకు ఇందులో అవకాశం వచ్చిందని తెలియగానే సంతోషం కంటే సవాల్‌ను ఎదుర్కొంటున్నట్టు అనిపించింది. నాపై ఎంతో బాధ్యత ఉందని గ్రహించాను. బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. దర్శకుడు మనీశ్‌శర్మ, నిర్మాత ఆదిత్యచోప్రాను ఇబ్బంది పెడుతున్నానేమోనని మొదట్లో భయపడ్డాను’ అని వివరించింది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ తదనంతరం నిర్మించే మూడు సినిమాల్లోనూ వాణి హీరోయిన్గా కనిపిస్తుంది. బ్యాండ్ బాజా బారాత్ తెలుగు/తమిళ రీమేక్‌లోనూ ఈ బ్యూటీ మెరవనుంది. దీనిని కూడా యశ్ సంస్థే తీస్తోంది. దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ‘కథలో పెద్దగా మార్పు ఉండదు కానీ సాంస్కృతిక అంశాలు మాత్రం వేరుగా ఉంటాయి. మూలకథలోని విషయాలను దక్షిణాది ప్రేక్షకులకు అనువుగా ఉండేలా తీర్చిదిద్దాం’ అని చెప్పింది. సినీ కుటుంబం నుంచి రాలేదు కాబట్టి నటనకు అలవాటు పడడం కాస్త కష్టమేనని చెప్పిన వాణి మొదట మోడల్‌గా పనిచేసి తరువాత బాలీవుడ్లో అడుగుపెట్టింది. ‘మాది ఢిల్లీ. ముంబైలో ఎవరూ తెలియకున్నా అక్కడికి వెళ్లాలి. కాబట్టి బాలీవుడ్‌కు అలవాటుపడడానికి కాస్త సమయం పడుతుంది’ అని వివరించింది.