సుశాంత్‌ ఆత్మహత్య : విలపించిన సోదరి | sushant singh rajput No More : Actor Sister Breaks Down As She Arrives At Cooper Hospital | Sakshi
Sakshi News home page

సుశాంత్‌ ఆత్మహత్య : విలపించిన సోదరి

Published Sun, Jun 14 2020 8:44 PM | Last Updated on Sun, Jun 14 2020 9:03 PM

sushant singh rajput No More : Actor Sister Breaks Down As She Arrives At Cooper Hospital - Sakshi

ముంబై : యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ వర్గాల్లో దిగ్బ్రాంతి కలిగించింది. కెరీర్‌లో మంచి స్టేజీలో ఉన్నపుడు ఆయన తీసుకున్న అనూహ్య నిర్ణయం అభిమానులతో కూడా కంటనీరు పెట్టిస్తుంది. ఆదివారం మధ్యాహ్నం ముంబై, బాంద్రాలోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని సుశాంత్‌ ఆత్మ హత్య చేసుకున్నాడు. ఆయన మరణవార్త వినగానే బాలీవుడ్‌ ఇండస్త్రీ ఉలిక్కి పడింది.  ఈ వార్త తమకు షాక్‌కు గురి చేసిందని, సుశాంత్‌ ఆత్మకు శాంతి చేకూరాలని  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు బాలీవుడ్‌, టాలీవుడ్‌ చెందిన పలువురు ట్వీట్‌ చేశారు.

సుశాంత్‌ మరణ వార్త విని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పట్నా నుంచి విమానంలో వచ్చేందుకు సిద్దమవుతున్నారు. కూపర్‌ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం సుశాంత్‌ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఇప్పటికే కూపర్‌ ఆస్పత్రికి చేరుకున్న సుశాంత్‌ సోదరి.. తమ్ముడిని తలచుకుంటూ బోరున విలపించింది. 



అందరి కంటే చిన్న, అల్లారుముద్దుగా పెరిగి..
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ బీహార్‌లోని పాట్నాలో 1986 జనవరి 21న జన్మించాడు. అతనికి నలుగురు అక్కలు. సోదరి మిథు సింగ్‌ రాష్ట్ర స్థాయి క్రికెటర్‌. కుటుంబంలో అందరికంటే చిన్న వాడు కావడంతో అతన్ని అల్లారుముద్దుగా పెంచారు. చిన్నతనం నుంచి ఎంతో యాక్టివ్‌గా ఉండే సుశాంత్‌ చదువులోనూ అందరికంటే యాక్టివ్‌గా ఉండేవారు.

2002లో కన్నతల్లి మరణం సుశాంత్‌ను మానసికంగా కుంగుబాటుకు గురిచేసింది. అదే ఏడాది సుశాంత్‌ కుటుంబం పట్నా నుంచి ఢిల్లీకి షిప్ట్‌ అయింది. ఏఐఈఈఈ(AIEEE)ఆయన ఆల్‌ఇండియా 7వ ర్యాంకు సాధించారు. ఢిల్లీలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో చేరాడు. నటుడు కావాలనే కోరికతో చివరి ఏడాది చదవు మానేసి ప్రముఖ కొరియోగ్రాఫర్‌ షియామాక్‌ ధావర్‌ వద్ద శిష్యునిగా చేరాడు. బుల్లితెరపై నచించడానికి ముందు పలు అవార్డు వేడుకలలో, వివిధ కార్యక్రమాల్లో డాన్సర్‌గా ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత హీరోగా మారాలనే కలతో సుశాంత్‌ ముంబైకి వచ్చాడు. ఎంతో కష్టపడి స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement