రోజూ పూలు పంపిస్తే ప్రేమిస్తా..! | my good friend is Mother say Kriti Kharbanda | Sakshi
Sakshi News home page

రోజూ పూలు పంపిస్తే ప్రేమిస్తా..!

Published Thu, May 14 2015 11:17 PM | Last Updated on Sun, Sep 3 2017 2:02 AM

రోజూ పూలు పంపిస్తే ప్రేమిస్తా..!

రోజూ పూలు పంపిస్తే ప్రేమిస్తా..!

 ‘‘నా జీవితంలో ఇప్పటికీ, ఎప్పటికీ మంచి ఫ్రెండ్ మా అమ్మే. ఆమెతో అన్ని విషయాలూ పంచుకుంటాను.     అవి ఏవైనా సరే. అందుకే షూటింగ్స్‌లో నాతో పాటు మా అమ్మ కంపల్సరీగా ఉండాల్సిందే. ఇప్పటి దాకా నేను ఎవరినీ ప్రేమించలేదు. కానీ ఒక్క సారి ప్రేమిస్తే ప్రాణమిస్తా. అంత బాగా చూసుకుంటా. నాకు నచ్చే పనులు చేస్తూ, నా కోసం రోజూ పూలు పంపించేవాణ్ణే నేను ప్రేమిస్తా.
 
 కానీ అలాంటి వాళ్లు ఇప్పటిదాకా నాకు తారసపడలేదు. జీవితంలో చాలా హడావిడిగా నిర్ణయం తీసుకునేవాళ్లంటే నాకు నచ్చరు. నేనెప్పుడూ సంప్రదాయ పద్ధతిలో ఉండటానికే ఇష్టపడతా. అందుకేనేమో నాకూ అబ్బాయిల్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నా నా పద్ధతి తెలిసి... వాళ్లల్లో నన్నె వరూ ప్రపోజ్ చేయలేదనుకుంటా. నేను గాళ్‌ఫ్రెండ్ మెటీరియల్ కాదని, నా ఫ్రెండ్ ఎప్పుడో చెప్పింది.’’
 - కృతీ కర్బందా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement