‘బాహుబలి’ పనయిపోయింది: రాజమౌళి
‘బాహుబలి-2’ మూవీ యూనిట్ ప్రమోషన్ ఈవెంట్ లండన్ లో ముగిసింది. మరోవైపు బాక్సాఫీసు రికార్డులు బద్దలుకొడుతున్న బాహుబలి-2 వెయ్యి కోట్ల కలెక్షన్ల వైపు దూసుకెళ్తుంది. లండన్ లో ప్రమోషన్ ముగిసిన తర్వాత బాహుబలి కోసం దాదాపు ఐదేళ్లు కష్టపడ్డ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రాజెక్టులో తన పని పూర్తయిందని ట్వీట్ చేశారు. బాహుబలి సిరీస్ లను ఆదరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యావాదాలు తెలిపారు. జక్కన్న భారీ ప్రాజెక్టు సక్సెస్ తో రిలాక్స్ అయినట్లు కనిపిస్తున్నారు. బాహుబలి మూవీ యూనిట్ లండన్ లో పలు ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొని సందడి చేసింది.
ఈ సందర్భంగా రాజమౌళి మూవీ యూనిట్ తో సెల్ఫీ తీసుకుని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. జక్కన్నతో పాటు సంగీత దర్శకుడు కీరవాణి, నటి అనుష్క, మూవీ నిర్మాత ఈవెంట్లలో పాల్గొన్నారు. అయితే రాజమౌళి ఇక్కడి బ్రిటీష్ ఫిలిం ఇన్సిస్టిట్యూట్ ను సందర్శించిన సందర్భంగా బాహుబలి-3పై ఆశలు రేకెత్తించిన విషయం తెలిసిందే. తండ్రి విజయేంద్రప్రసాద్ తనను మెప్పించే కథ అందిస్తే మూడో భాగం తీస్తానని హింట్ ఇచ్చిన డైరెక్టర్.. ఇక్కడ ప్రమోషన్ ఈవెంట్లో ‘ మై జాబ్ ఈజ్ కంప్లీట్ లీ ఓవర్’ అంటూ ట్విస్ట్ ఇచ్చారు.
బాహుబలి-2 ప్రమోషన్ ఈవెంట్లు ముగిశాయని రాజమౌళి స్పష్టంచేశారు. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి మరోసారి రాజమౌళి తర్వాతి ప్రాజెక్టుపై ఉంది. ఆయన అభిమానులు మాత్రం రజనీకాంత్ తో మూవీ చేస్తే చూడాలని ఆశిస్తున్నారు. రజనీ ఈమేజ్ కు తగ్గట్లు కథ వస్తే అందుకు తాను సిద్ధమేనని రాజమౌళి మరోసారి ప్రస్తావించారు.
And with this last leg of promotion in london my job with Baahubali film series is completely over..
A big hug and thanks to everyone..