
సినిమాలు, బిజినెస్‌లతో బిజీగా ఉండే నాగార్జున సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. తన సినిమా ప్రమోషన్‌తో పాటు ఇతర హీరోల సినిమాలపైనా స్పందిస్తుంటాడు. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో నాగార్జున పేరిట ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన ఆకతాయిలు, ఆ అకౌంట్ నుంచి పోస్ట్‌లు చేస్తున్నారు.
ఈ విషయం నాగ్ వరకూ చేరటంతో ఆయన ట్విటర్ ద్వారా స్పందించారు. ఫేక్ అకౌంట్ లింక్‌ను పోస్ట్ చేసిన నాగ్ ఇది నా అఫీషియల్ అకౌంట్ కాదంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు తాను ఇన్‌స్టాగ్రామ్‌లోకి రావాలనుకున్నప్పుడు స్వయంగా ప్రకటిస్తానని తెలిపారు.
ప్రస్తుతం నాగార్జున రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మథుడు 2 సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది. నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
This isn’t me...!!https://t.co/ExF7bP9PqB
— Nagarjuna Akkineni (@iamnagarjuna) 15 June 2019
Will definitely update you all when I am on @instagram
Comments
Please login to add a commentAdd a comment