మల్టిస్టారర్‌ల హవా కొనసాగుతున్న ఈ టైమ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది దేవదాస్. టాలీవుడ్ కింగ్ నాగార్జున, నాచురల్‌స్టార్ నాని కాంబినేషన్‌లో వస్తోన్న ఈ మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ మధ్య విడుదల చేసిన లిరికల్ సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. చిత్ర యూనిట్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. నాగార్జున ఈ విషయాన్ని ట్వీట్ చేశాడు. డాన్‌గా దేవ పాత్రలో నాగ్ నటిస్తుండగా, డాక్టర్‌గా దాసు పాత్రలో నాని నటిస్తున్నాడు. ఆకాంక్ష సింగ్, రష్మిక మందాన్న హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. దేవదాస్ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
And it’s a wrap for #Devadas !!! Thank uuuuuu team DevaDas 🙏...it was amazing!!! pic.twitter.com/uzcLPD3pmF
— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 11, 2018
Comments
Please login to add a commentAdd a comment