టాప్‌ హీరోతో పూరీ మల్టీస్టారర్‌? | Nagarjuna Naga Chaitanya Multi Starrer with Puri Jagannadh | Sakshi
Sakshi News home page

Published Mon, May 21 2018 7:31 PM | Last Updated on Mon, May 21 2018 7:51 PM

Nagarjuna Naga Chaitanya Multi Starrer with Puri Jagannadh - Sakshi

దర్శకుడు పూరీ జగన్నాథ్‌

సాక్షి, హైదరాబాద్‌: మెహబూబా చిత్ర ఫలితంతో ఢీలా పడిపోకుండా తన తర్వాతి ప్రాజెక్టు పనిలో దర్శకుడు పూరీ జగన్నాథ్‌ మునిగిపోయారు. తనయుడు ఆకాశ్‌తోనే తర్వాతి చిత్రం తీసేందుకు దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ మధ్యలో ఓ స్టార్‌ హీరోకు ఓ కథను వినిపించి ప్రాజెక్టును ఖరారు చేసుకున్నాడనే వార్త చక్కర్లు కొడుతోంది. 

మెహబూబా చిత్ర విడుదలకు ముందే నాగార్జున అక్కినేనికి ఓ కథను వినిపించారంట. ఎమోషనల్‌ కంటెంట్‌తో ఉన్న ఆ కథ నచ్చటంతో నాగ్‌ ఓకే చేశాడని, పైగా నాగ చైతన్యతో అది మల్టీస్టారర్‌గా తెరకెక్కించబోతున్నాడని ఆ కథనం సారాంశం. మెహబూబా ఫలితంతో సంబంధం లేకుండా మరీ ఆ ప్రాజెక్టును నాగ్‌ కమిట్‌ అయినట్లు ఆ వార్త ఉటంకించింది. అయితే నానితో చేస్తున్న మల్టీస్టారర్‌, బంగార్రాజు ప్రాజెక్టు పూర్తయ్యాక పూరీతో మల్టీస్టారర్‌ ప్రారంభిస్తారంట. దీనిపై అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వెలువడాల్సి ఉంది.

గతంలో పూరీ-నాగ్‌ కాంబోలో శివమణి, సూపర్‌ చిత్రాలు వచ్చాయి. దాదాపు దశాబ్దం గ్యాప్‌ తర్వాత వీళ్లు మళ్లీ జత కడుతున్నారని, ముఖ్యంగా వరుస ఫెయిల్యూర్స్‌తో ఉన్న పూరీకి నాగ్‌ ఛాన్స్‌ ఇవ్వబోతున్నాడన్న వార్త ఆసక్తికరంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement