నాని
దేవ చేసిన ట్వీట్‌తో తన ఒత్తిడి పోయిందంటున్నాడు దాసు.. ఈ దేవ, దాసు ఎవరనుకుంటున్నారా అదేనండి కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘దేవదాస్’ మూవీలోని పాత్రలు. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగార్జున ‘ఇప్పుడే దేవదాస్ సినిమా చూశాను. విజయం నా పాకెట్ లో వుంది. ఆ ధైర్యం, ఆనందంతోనే హైదరాబాద్ విడిచి ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళుతున్నాను. ఇక ముందున్నది హాలిడే లైఫే. థ్యాంక్స్ టూ లెజెండరీ వైజయంతీ మూవీస్. అమేజింగ్ నాని అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య’ అని ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ నాని.. ‘చాలా ఒత్తిడితో కూడుకున్న ఈ రోజును మీ ట్వీట్‌తో నా రోజుగా మలిచారు సర్.. నేను రేపు అభిమానులతో కలిసి సినిమా చూస్తాను. మీ ప్రయాణం బాగా జరగాలి. మీరు తిరిగొచ్చిన తర్వాత కలుస్తా’ అని పేర్కొన్నాడు. ఇక నాని సైతం బిగ్‌బాస్ ఫైనల్ అనంతరం కొన్ని రోజులు ఏ కాశీకో వెళ్లిపోతానని ప్రెస్‌మీట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. రష్మిక మందాన్న, ఆకాంక్ష సింగ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ.. వైజయంతీ మూవీస్ నిర్మించగా మణిశర్మ సంగీతం అందించారు.
Quite a stressful day it was and your tweet made my day Sir ..I will be watching it tomorrow with the audience ... Have a great trip and see you soon when you are back 🤗 @iamnagarjuna https://t.co/cmruzaM7QW
— Nani (@NameisNani) September 26, 2018
Comments
Please login to add a commentAdd a comment