టాలీవుడ్‌లో మల్టిస్టారర్ హవా మళ్లీ మొదలైంది. పెద్ద హీరోలు, యువ హీరోలతో కలిసి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాబోతోన్న మల్టిస్టారర్‌లో కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నానిలు కలిసి చేస్తున్న దేవదాస్ మూవీ ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్స్ వైరల్ అవుతున్నాయి.
తాజాగా ‘దేవదాస్’లోని వినాయక చవితి స్పెషల్ సాంగ్ డ్యాన్స్‌ను చాలెంజ్‌గా విసిరారు. మేము రెడీ మీరు రెడీనా అంటూ వీడియో సాంగ్ ప్రోమోను నాని షేర్ చేశారు. మీరు కూడా వినాయక చవితి సెలబ్రేషన్స్‌కు సంబంధించిన డ్యాన్సింగ్ వీడియోను ట్యాగ్ చేస్తే... దేవదాస్ టీమ్ తరపున సర్‌ప్రైజింగ్ గిఫ్ట్స్ పొందగలరని ట్వీట్ చేశారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది.
Memu ready
— Nani (@NameisNani) September 15, 2018
Meeru ready aa ? 🤗#DevaDas https://t.co/pzdhrZYhyy
Comments
Please login to add a commentAdd a comment