సినిమా అంతా ఒకే చీరతో..! | Nayanthara in Aramm | Sakshi
Sakshi News home page

సినిమా అంతా ఒకే చీరతో..!

Published Sun, Dec 4 2016 3:48 PM | Last Updated on Mon, Sep 4 2017 9:54 PM

సినిమా అంతా ఒకే చీరతో..!

సినిమా అంతా ఒకే చీరతో..!

ప్రజెంట్ సౌత్ ఇండస్ట్రీ నంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే..? వెంటనే గుర్తొచ్చే పేరు నయనతార. స్టార్ హీరోల సరసన గ్లామర్ రోల్స్ చేస్తూనూ.. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో అలరిస్తోంది ఈ బ్యూటి. అదే స్థాయిలో భారీ రెమ్యూనరేషన్ కూడా అందుకుంటున్న నయన్, సౌత్ లో టాప్ ప్లేస్ లో ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటి తమిళ్ నాట ఓ ఇంట్రస్టింగ్ సినిమాలో నటిస్తోంది. లేడీ ఓరియంటెండ్ మూవీగా తెరకెక్కుతున్న అరమ్ సినిమా కోసం ఓ సాహసం చేస్తోంది.

ఈ సినిమాలో ప్రజా సమస్యల మీద పోరాటం చేసే కలెక్టర్ పాత్రలో నటిస్తున్న నయనతార సినిమా అంతా ఒకే కాస్ట్యూమ్ లో కనిపించనుందట. నీటి సదుపాయం లేని ఓ గ్రామానికి లేడీ కలెక్టర్ ఒక్క రోజులో నీరు ఎలా తెప్పించింది అన్న కథాశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయన్ మరోసారి తన యాక్టింగ్ స్కిల్స్ చూపించనుంది. మింజూర్ గోపి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement