‘హుష్‌’.. అది నిజం కాదు! | Nayanthara's 'Kolayuthir Kalam' a remake of 'Hush' | Sakshi
Sakshi News home page

‘హుష్‌’.. అది నిజం కాదు!

Published Wed, Dec 28 2016 12:06 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 PM

‘హుష్‌’.. అది నిజం కాదు!

‘హుష్‌’.. అది నిజం కాదు!

నయనతార ముఖ్య తారగా చక్రి తోలేటి దర్శకత్వంలో సంగీత దర్శకుడు యువన్‌శంకర్‌ రాజా నిర్మించనున్న సినిమా ‘కొలై ఉదిర్‌ కాలమ్‌’. త్వరలో చిత్రీకరణ ప్రారంభించనున్నారు. సెట్స్‌ మీదకు వెళ్లడానికి ముందే ఈ సినిమా వార్తల్లో నిలిచింది. కమల్‌హాసన్‌ ‘ఈనాడు’, అజిత్‌ ‘బిల్లా–2’ సినిమాల తర్వాత చక్రి తోలేటి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని ‘రెడ్‌ ఎపిక్‌–డబ్ల్యూ’ అడ్వాన్స్‌ టెక్నాలజీ కెమేరాతో 8కె రిజల్యూషన్‌లో షూట్‌ చేయనున్నారు. ‘‘8కె రిజల్యూషన్‌లో షూటింగ్‌ చేయనున్న తొలి భారతీయ చిత్రాల్లో మా ‘కొలై ఉదిర్‌ కాలమ్‌’ ఒకటి’’ అన్నారు దర్శకుడు చక్రి తోలేటి. ఈ సినిమా హాలీవుడ్‌ మూవీకి రీమేక్‌ అని వార్తలొచ్చాయి. వాటిపై స్పందిస్తూ.. ‘‘అమెరికన్‌ హారర్‌ థ్రిల్లర్‌ ‘హుష్‌’కు రీమేక్‌ కాదిది. అందులో ఓ పాత్ర స్ఫూర్తితో సరికొత్త కథ రాసుకున్నాం’’ అన్నారాయన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement