రణ్‌బీర్‌తో ప్రేమలో ఉన్నప్పుడు ఏమైంది మరి?! | Neetu Kapoor Shares Adorable Pic With Deepika Padukone | Sakshi
Sakshi News home page

‘భలే నాటకాలు ఆడుతున్నారుగా...!!’

Published Tue, May 14 2019 7:39 PM | Last Updated on Tue, May 14 2019 7:51 PM

Neetu Kapoor Shares Adorable Pic With Deepika Padukone - Sakshi

ఒకప్పుడు ప్రేమికులుగా ఉన్న బాలీవుడ్‌ రీల్‌ కపుల్‌ రణ్‌బీర్ కపూర్‌‌- దీపికా పదుకొనే ప్రస్తుతం స్నేహితులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీపికతో పాటు ఆమె భర్త రణ్‌వీర్‌ సింగ్‌ కూడా రణ్‌బీర్‌ ఇంటికి కూడా వెళ్లడం ద్వారా.. కపూర్‌ ఫ్యామిలితో అనుబంధం ఏర్పరచుకున్నాడు. కాగా రణ్‌బీర్‌ తండ్రి రిషి కపూర్‌ క్యాన్సర్‌తో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో దీపికా రిషి కపూర్‌ను పరామర్శించింది. కపూర్‌ దంపతులను కలిసి కాసేపు వారితో ముచ్చటించింది.

ఈ సందర్భంగా దీపికాకు బ్రేస్‌లెట్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన రణ్‌బీర్‌ తల్లి నీతూ కపూర్‌.. ఆమెతో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘దీపిక రాకతో మా సాయంత్రం ఎంతో ఆత్మీయంగా మారింది. మాపై ఎంతో ప్రేమను కురిపించింది’ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. కాగా నీతూ పోస్ట్‌పై స్పందించిన దీపిక అభిమానులు.. ‘ కపూర్‌ ఫ్యామిలి సమయానికి తగ్గట్టుగా భలే నాటకాలు ఆడుతున్నారు. రణ్‌బీర్‌తో దీపిక ప్రేమలో ఉన్న సమయంలో ఆమెను ఎంతగా బాధపెట్టారో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మాత్రం ఇలా ఎలా చేయగలుగుతున్నారు నీతూ కపూర్‌’ అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేగాక ‘దీపిక అందమైన మనస్సు ఉన్నది కాబట్టే తనను బాధ పెట్టిన వారిని కూడా పెద్ద మనస్సుతో క్షమించగలదు. దటీజ్‌ దీపికా’ అంటూ పద్మావత్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక దీపికాకు బ్రేకప్‌ చెప్పిన తర్వాత కత్రినాతో ప్రేమలో పడ్డ రణ్‌బీర్‌ ఆమెతో కూడా తెగదెంపులు చేసుకుని.. ప్రస్తుతం అలియా భట్‌తో డేటింగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. దీపికా కూడా తన సోల్‌మేట్‌ రణ్‌వీర్‌ సింగ్‌ను పెళ్లాడి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ మాజీ ప్రేమజంట ఓ సినిమాలో కలిసి నటిస్తున్నారు కూడా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement