
నరదృష్టికి నల్లరాయి అయినా బద్దలవుతుంది అనే సామెత ఉంది. దీన్ని కొందరు నమ్ముతారు.. కొందరు నమ్మరు. నమ్మేవాళ్లు మాత్రం తరచూ దిష్టి తీయించుకుంటుంటారు. ఇరుగు దిష్టి.. పొరుగు దిష్టి.. నీ దిష్టి... నా దిష్టి... థూ.. థూ.. థూ.. అని దిష్టి తీయించుకుని రిలాక్స్ అయిపోతారు. ‘ఇక ఏమీ కాదు’ అనే ధీమాతో ఉంటారు. ఇప్పుడు ‘కంచె’ ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ కూడా అలానే ఉన్నారు. ఈ సంవత్సరం ఇప్పటివరకూ ఈ బ్యూటీ మూడుసార్లు గాయపడ్డారు. అవి చిన్నవే కావడంతో పెద్దగా కంగారు పడలేదు. అయితే.. తరచూ ఇలా జరగడంతో దిష్టి తగిలిందేమోనని సన్నిహితులు అన్నారట. అసలే అందగత్తె. అద్భుతమైన నటి... దిష్టి తగిలే ఉంటుందేమో కదూ! అందుకే ప్రగ్యాకి ఆమె ఫ్రెండ్స్ దిష్టి తీశారు. ఇన్‌సెట్‌లో మీరు చూస్తున్న ఫొటో దిష్టి తీస్తున్నప్పటిదే. ‘బ్యాడ్ ఎనర్జీని తీసేస్తున్నాం. ఇక దిష్టి తగలదు’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment