
హీరోయిన్లను సోషల్ మీడియా కష్టాలు వెంటాడుతున్నాయి. చాలా సందర్భాల్లో చిన్న విషయాలకే తారలను నెటిజెన్లు ట్రోల్ చేయటం చూస్తుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో తమకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా సోషల్ మీడియా అకౌంట్ల వల్ల నటీనటులు ఇబ్బందుల పాలవుతుంటారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ తమన్నా అలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు.
ఇటీవల బిగ్‌బాస్ షో సీజన్ 3లోకి ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి హీరోయిన్ తమన్నా ట్విటర్ అకౌంట్‌ను ట్యాగ్ చేస్తూ వేల కొద్ది ట్వీట్లు వస్తున్నాయట. వీటిలో నెగెటివ్ ట్వీట్లు కూడా ఉండటంతో ఏం చేయాలో అర్ధంకాక మిల్కీ బ్యూటీ తలపట్టుకున్నారు. తమన్నా సింహాద్రి బిగ్‌బాస్‌లో కొనసాగినంత కాలం హీరోయిన్ తమన్నాకు ఈ ఇబ్బందులు తప్పేలా లేవు.
Comments
Please login to add a commentAdd a comment