మళ్లీ భయపెట్టనున్న కన్‌జ్యూరింగ్-2 | New TV spot for horror sequel The Conjuring 2 | Sakshi
Sakshi News home page

మళ్లీ భయపెట్టనున్న కన్‌జ్యూరింగ్-2

Published Sat, May 14 2016 4:40 AM | Last Updated on Mon, Sep 4 2017 12:02 AM

మళ్లీ భయపెట్టనున్న కన్‌జ్యూరింగ్-2

మళ్లీ భయపెట్టనున్న కన్‌జ్యూరింగ్-2

ది కంజ్యూరింగ్ హారర్ కథా చిత్రం అనడానికి అసలైన నిదర్శనం ఇది. ప్రేక్షకులకు భయం అంటూ ఏమిటో తెలిపిన చిత్రం. ఉత్కంఠకు పరాకాష్ట. ప్రేక్షకులు క్షణం క్షణం గుండెల్ని గుప్పెట్లో పెట్టుకుని చూసిన చిత్రం ది కంజ్యూరింగ్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు  వసూలు చేసిన రెండో హారర్ చిత్రంగా రికార్డ్‌కెక్కిన చిత్రం ఇది. ఆ చిత్ర దర్శకుడు జేమ్స్‌వాన్ తాజాగా ది కంజ్యూరింగ్‌కు సీక్వెల్‌ను సిద్ధం చేశారు. ది కంజ్యూరింగ్ చిత్రం కంటే మరింత ఆసక్తికరంగా, ఉత్కంఠభరింతంగా,అన్నిటికీ మించి మరింత భయపెట్టే చిత్రంగా కంజ్యూరింగ్-2 ఉంటుందంటున్నారు చిత్ర వర్గాలు.

ఇది కూడా పారానార్మల్ ఇతివృత్తంతో కూడిన చిత్రమే.అయితే యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ నిర్మించడం విశేషం. నలుగురు పిల్లలతో తల్లి నివశించే ఒక ఇంట్లో జరిగే అనూహ్య సంఘటనలను ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ఎలా ఛేదించాడన్న పలు ఆసక్తికమైన అంశాలతో కూడిన ఈ చిత్రాన్ని ఆంగ్లం,తమిళ భాషల్లో జూన్ 10వ తేదీన విడుదల చేయనున్నట్లు వార్నర్ బ్రదర్స్ నిర్వాహకులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement