ఆ సినిమాకు కుక్కలు కూడా వణికిపోతున్నాయి | conjuring movie creating fear | Sakshi
Sakshi News home page

ఆ సినిమాకు కుక్కలు కూడా వణికిపోతున్నాయి

Published Mon, Jun 27 2016 1:26 PM | Last Updated on Mon, Oct 1 2018 5:19 PM

ఆ సినిమాకు కుక్కలు కూడా వణికిపోతున్నాయి - Sakshi

ఆ సినిమాకు కుక్కలు కూడా వణికిపోతున్నాయి

ది కంజ్యూరింగ్-2.. ఇప్పుడు ఈ హాలీవుడ్ సినిమా చేస్తున్నంత హల్ చల్ మరే చిత్రం కూడా చేయడం లేదు. థియేటర్లోకి వెళుతున్నవారు తమ గుండెలను అదిమిపట్టుకుంటూనే భయపడేందుకు ఇష్టపడుతున్నారు. ఒక్కొక్కరు రెండు మూడుసార్లు ఈ సినిమా చూస్తూ భయాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారంటే ఆ సినిమా ఎంత ఆసక్తిగా తీశారో వేరే చెప్పనక్కర్లేదు. అయితే, ఈ సినిమా చూసిన వాళ్లే కాదు.. జంతువులు కూడా తెగ భయపడిపోతున్నాయని ఓ వీడియో చెబుతోంది. సామాజిక అనుసంధాన వేదికల్లో ఒకటైన ట్విట్టర్ లో ఒక వ్యక్తి ది కంజ్యూరింగ్-2సినిమాను ప్రస్తావిస్తూ ఓ వీడియో ట్వీట్ చేశాడు.

ఇందులో ఓ ఇంట్లో టీవీలో ది కంజ్యూరింగ్-2 సినిమాను కుక్క కూడా ఎంతో ఆసక్తిగా చూస్తు అందులో వచ్చే భయానక సన్నివేశాలు చూసి చివరకు  అది కూడా భయంతో సోఫా చాటుకెళ్లి నక్కింది. సాధారణంగా దెయ్యాలను చూస్తే కుక్కలు మొరుగుతాయని, వెంటపడి తరుముతాయని చెప్పడం విన్నాం కానీ.. ఇలా దెయ్యం సినిమా చూసి భయపడి దాచుకునే కుక్కలు ఉంటాయని తెలుసుకోవడం మాత్రం ఇదే తొలిసారి. ఈ ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని వీడియో తీసి ఓ వ్యక్తి పోస్ట్ చేయగా మన తెలుగు సినిమా దర్శకుడు పూరీ జగన్నాథ్ తన ఖాతా ద్వారా రీ ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement