కొత్తరకం వినోదం | Newer Entertainment | Sakshi
Sakshi News home page

కొత్తరకం వినోదం

Published Tue, Mar 29 2016 11:13 PM | Last Updated on Sun, Sep 3 2017 8:49 PM

కొత్తరకం వినోదం

కొత్తరకం వినోదం

 ‘‘రెండు గంటలు కథ విన్న తర్వాతే ఈ చిత్రం చేయడానికి అంగీకరించా. స్క్రిప్ట్ మొత్తం పూర్తయిన తర్వాతే సెట్స్‌పైకి వెళుతున్నాం. ఈ చిత్రం నా కెరీర్‌లో పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని హీరో సునీల్ అన్నారు. సునీల్, మియా జంటగా యునెటైడ్ మూవీస్ పతాకంపై క్రాంతిమాధవ్ దర్శకత్వంలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్న కొత్త చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
 
  దర్శకుడు మాట్లాడుతూ-‘‘ ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకుని చేస్తున్న చిత్రమిది. మంచి కామెడీ చిత్రం చేయాలనే తపనతో చేస్తున్నా. ఈ కథకు సునీల్ అయితేనే కరెక్ట్‌గా యాప్ట్ అవుతాడనిపించింది. ఇప్పటి వరకూ వచ్చిన సునీల్ సినిమాల్లోని వినోదం కన్నా ఇందులో కొత్తగా ఉంటుంది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement